నేనూ ఓ మూలన... సమంతతో పెళ్లిపై రాజ్ నిడిమోరు మాజీ భార్య షాకింగ్ పోస్ట్
ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఏ హడావుడి లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు - రాజ్ నిడిమోరు. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో వీరి వివాహం సన్నిహితుల మధ్య జరిగింది. భూతశుద్ధి వివాహం అనే సాంప్రదాయంలో సమంత - రాజ్‌లు ఒక్కటయ్యారు. అయితే ప్రస్తుతం రాజ్ నిడిమోరు మొదటి భార్య శ్యామాలి దే గురించి చర్చనీయాంశమైంది. రాజ్ - సమంతల పెళ్లి తర్వాత ఆమె స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
సమంత కంటే ముందు రాజ్ నిడిమోరుకు శ్యామాలి దేతో వివాహం జరిగింది. ముంబై యూనివర్సిటీలో సైకాలజీ గ్రాడ్యుయేట్ అయిన శ్యామాలి.. అనంతరం సినీరంగం వైపు అడుగులు వేశారు. 24 క్రాఫ్ట్స్‌పై అనుభవాన్ని సంపాదించింది. రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా, విశాల్ భరద్వాజ్ తదితర దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. అనంతరం 2015లో రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ దర్శకులే కావడంతో తన ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లు, సినిమాలపై రాజ్, శ్యామాలిలు కలిసి పనిచేసేవారు.

రాజ్ - శ్యామాలిలకు ఓ కుమార్తె సంతానం. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగగా.. ఏం జరిగిందో? ఏమో కానీ ఏడేళ్ల వివాహ బంధానికి తెరదించుతూ 2022లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తోన్న సమయంలో రాజ్ నిడిమోరుతో సమయంతకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అంతకుముందే 2021లో తన భర్త, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నారు.
అయితే రాజ్ జీవితంలోకి సమంత ప్రవేశించిన తర్వాతే వీరి కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్యామాలి దే తరచుగా రాజ్ - సమంతల బంధంపై పరోక్షంగా పోస్ట్‌లు పెట్టేవారు. దాంతో పలువురు నెటిజన్లు సమంతపై ట్రోలింగ్‌కు సైతం దిగారు. రెండ్రోజుల ముందు కూడా తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని శ్యామాలి దే పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. ఆ తర్వాత రుణానుబంధం ద్వారా పెంపుడు జంతువులు, జీవిత భాగస్వామి, పిల్లలు, ఇంటితో అనుబంధం ఏర్పడుతుంది. రుణం తీరిపోయినప్పుడు ఆ సంబంధాలు ముగిసిపోతాయి. దు:ఖాలు, సంతోషాలు అన్ని రుణంతోనే ముడిపడి ఉంటాయని శ్యామాలి దే అన్నారు. ఆమె ఈ పోస్ట్ చేసిన కొద్దిరోజులకే సమంత - రాజ్ నిడిమోరులు పెళ్లి చేసుకున్నారు.
తాజాగా రాజ్- సమంతల పెళ్లి జరిగిన గంటల తర్వాత శ్యామాలి దే స్పందించారు. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం అనేలా పాలపుంత, నక్షత్రాల సమూహంతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రాజ్‌తో విడాకుల తర్వాత ఆమె ఏం చేస్తున్నారు? ఆమెకు భరణం కింద రాజ్ ఎంత మొత్తం చెల్లించారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











