Shakuntalam: శాకుంతల లుక్‌తో సమంత.. దేవకన్యలా మెస్మరైజ్ చేస్తోందిగా!

'ఏ మాయ చేశావే' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు పదేళ్లుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత రూత్ ప్రభు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో హవా చూపిస్తోంది. అయితే, గతంలో మాదిరిగా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడం లేదు. అంతేకాదు, పంథాను పూర్తిగా మార్చుకుని కొంత కాలంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తోంది. అందులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా ఉంటున్నాయి.

'జాను' మూవీ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సీనియర్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో నటిస్తోంది. దిగ్గజ కవి కాళిదాసు రచించిన 'శకుంతల' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో వస్తోన్న 'శాకుంతలం' మూవీ విజువల్ వండర్‌గా తెరకెక్కబోతుంది. అందుకే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతోంది. ఇందుకోసం ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థలు చాలా శ్రమిస్తున్నాయి. ఇలా చాలా రోజులుగా ఈ వర్క్ జరుగుతూ వస్తోంది. ఇక, ఇప్పుడు ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే 'శాకుంతలం' మూవీ నుంచి సమంత ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిబ్రవరి 21 అంటే ఈరోజు విడుదల చేస్తున్నట్లు మూడు రోజుల ముందుగానే అధికారిక ప్రకటన వదిలింది.

Samantha Ruth Prabhu Shakuntalam First Look Released

ముందుగా చెప్పినట్లుగానే తాజాగా 'శాకుంతలం' మూవీ నుంచి సమంత రూత్ ప్రభు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శాకుంతలా దేవి గెటప్‌తో ఈ స్టార్ హీరోయిన్ మాయ చేస్తోంది. ప్రకృతి వనంలో ఆమె ఓ రాయిపై కూర్చుని ఉండగా.. లేడి పిల్లలు, నెమళ్లు, హంసలు చుట్టూ చేరాయి. ఈ పోస్టర్‌లో సమంత లుక్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా ఆమె ఎంతో స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపిస్తూ మాయ చేస్తోంది. అంతేకాదు, ఇందులో గుణశేఖర్ మార్క్ గ్రాఫిక్ వర్క్ కనిపిస్తోంది. విజువల్ కూడా కన్నుల నిండుగా ఉంది. దీంతో ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు.

గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత నటిస్తోన్న చిత్రమే 'శాకుంతలం'. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్, దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, వర్షిణి సౌందరాజన్, అల్లు అర్హ, మోహన్ బాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X