సమంత, శోభిత ధూళిపాల సోషల్ మీడియా వార్.. క్రిప్టిక్ పోస్టులతో సిగపట్లు.. చైతూ కోసమేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, బాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో సమంత, శోభిత చేసిన సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి వీటికి అర్థం ఏంటి అనే విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
సౌత్ క్వీన్ సమంత ఏప్రిల్ 28న తన 37వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఏథెన్స్ లో తన బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ఓ స్పెషల్ కన్ను గుర్తు ఉన్న పెండెంట్ రోజ్ గోల్డ్ చైన్ ను స్పెషల్ గా పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆమె మాజీ భర్త నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నారు అనే వార్తల మధ్య తాజాగా సమంత చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. బుధవారం నాడు సమంత మీ వృషభ రాశిని ఎప్పటికీ కోల్పోకండి (డోంట్ ఎవర్ లూజ్ యో టౌరస్) అని ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేసింది.
సమంత ఈ పోస్ట్ లో రాశి చక్రం వృషభం గురించి మాట్లాడుతూ చుట్టూ ఉన్న విషయాలను వదులుకోకూడదు అనే విషయాన్ని నొక్కి చెప్పినట్టుగా అనిపిస్తోంది. అయితే ఆ కాసేపటికే శోభిత ఐయాం నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ చాయ్... అండ్ దట్స్ ఓకే అంటూ మరో పోస్ట్ ని ఇన్స్టా లో షేర్ చేసింది. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల సమంత తన తెల్లటి వెడ్డింగ్ గౌన్ ను మార్చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన పుట్టినరోజున ఏథెన్స్ లో దిగిన ఫోటోలో ఆమె ఒక దుస్తుల స్టూడియో బయట రీ యుజ్ కాదు ట్రెండ్... ది ఫ్యూచర్ అనే టాగ్ లైన్ ను కనిపించేలా పోస్ట్ చేసింది. మొత్తానికి ప్రస్తుతం సమంత, శోభిత చేసిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి.
సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని, 2021లో విడిపోతున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడిన సమంత ప్రస్తుతం పూర్తిగా కోలుకొని సినిమాలపై ఫోకస్ చేస్తోంది.
ఇప్పుడు సమంత చేతిలో మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ తో పాటు సిటాడేల్ హనీ బన్నీ అనే ఓటిటి వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న, రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉండగా, శోభిత ధూళిపాళ్ళ మంకీ మాన్ మూవీతో రీసెంట్ గా హాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











