Yashoda Movie: సీక్వెల్ తో త్వరలోనే సర్‌ప్రైజ్‌.. అంతకుమించి అనేలా మరో యశోదగా సమంత!

టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హరి హరీష్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డీసెంట్ టాక్ తో మంచి కలెక్షన్స్ అందుకుంటున్న సమంత ఇప్పుడు సీక్వెల్ లో కూడా నటించబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి ఓపెనింగ్స్

మంచి ఓపెనింగ్స్

ఆదిత్య 369 నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్లో తెరకెక్కిన యశోద సినిమాపాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ట్రైలర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మొత్తానికి సినిమా నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైన విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు ఈ సినిమా డీసెంట్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ అందుకుంది.

పెరుగుతున్న కలెక్షన్స్

పెరుగుతున్న కలెక్షన్స్

మొదటి రోజు కంటే కూడా రెండో రోజు యశోద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరగడం విశేషం. సమంత రేంజ్ ఏమిటో మరోసారి ఈ సినిమాతో అర్థమైందని కూడా అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇక సమంత ఈ సినిమాలో అద్భుతమైన నటన ఎంతగానో ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆమెన్ చేసిన విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా సమంత ప్రశంసలు అందుకుంది.

 సీక్వెల్ ప్లాన్

సీక్వెల్ ప్లాన్


అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటున్న యశోద సినిమాకు ముందుగానే సీక్వెల్ తీస్తే బాగుంటుంది అని దర్శకులు హరి హరీష్ అనుకున్నారట. అయితే ఫస్ట్ పార్ట్ కు ఇప్పుడు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో తప్పకుండా సెకండ్ పార్ట్ ను కూడా తెరపైకి తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో సమంత సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన విధానం కూడా సినిమాల్లో చాలా హైలైట్ గా నిలిచింది.

కంటెంట్ కు తగ్గట్టుగా

కంటెంట్ కు తగ్గట్టుగా

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సమంత నటించిన విధానంతోనే ఇలాంటి కథకు మరొక సీక్వెల్ వస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో టాక్ అయితే గట్టిగానే వచ్చింది. ఇంకా అనుకున్నట్లే చిత్ర యూనిట్ సభ్యులు కూడా చర్చల్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. హరి హరీష్ ఈ సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా సమంత యశోద క్యారెక్టర్ ను ఇంకా కొనసాగించబోతున్నారు.

బెస్ట్ మూవీగా..

బెస్ట్ మూవీగా..


యశోద సినిమా సీక్వెల్ పై త్వరలోనే మరొక కీలకమైన అప్డేట్ ఇవ్వబోతున్నారు. బాక్సాఫీస్ వద్ద యశోద సినిమా రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతాయని రెండవ రోజుతోనే అర్థమైంది. ఒక విధంగా సమంత కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అంటున్నారు. ఇక సీక్వెల్ తో వస్తే సమంత మళ్ళీ ఎలా కనిపిస్తుంది అనే విషయం కూడా అభిమానుల్లో అంచనాలను పెంచింది. యశోద సినిమా కోసం నిర్మాత 35 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరి సెకండ్ సీక్వెల్ వస్తే అప్పుడు ఇంకా ఏ స్థాయిలో ఖర్చు చేస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేస్తోంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X