Samantha Ruth Prabhu రిలీజ్‌కు ముస్తాబవుతున్న యశోద..టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దక్షిణాది సూపర్ స్టార్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్ సినిమాగా, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం యశోద. హరి, హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రొడక్షన్ నంబర్ 14 గా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు అనుక్షణం ఉత్కంఠకు లోనై చూసే విధంగా యశోద రూపొందుతున్నది.
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకలును విశేషంగా ఆకట్టుకున్న సమంత మరోసారి హిందీ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్దమవుతున్నది.ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన రావడంతో నిర్మాత, దర్శకుల బాధ్యత మరింత పెరిగింది. అందుకే యశోద టీజర్ అద్బుతంగా కట్ చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 9న సమంత యశోద చిత్రం టీజర్ విడుదల కానున్నది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు
దర్శకత్వం: హరి - హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.
సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి,
పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి
కెమెరా: ఎం. సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి


Click it and Unblock the Notifications











