అమీర్ ఖాన్ తో నాగచైతన్య.. యాయ్ యాయ్ అంటూ ఫోటోలు షేర్ చేసిన సమంతా!
నటుడు అక్కినేని చైతన్య చివరగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉన్నా కరోనా రెండో దశ మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా వేశారు దర్శక నిర్మాతలు.. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన థాంక్యూ అనే సినిమా షూటింగ్ కోసం ఇటలీ కూడా వెళ్లారు.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది అనే ప్రచారం జరుగుతోంది.
ఇక తాజాగా ఆయన అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా అనే ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన సెట్ నుంచి ఒక ఫోటో చైతన్య తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.. ఈ ఫోటోలో నాగచైతన్య అమీర్ ఖాన్ ఇద్దరూ కూడా మిలిటరీ డ్రెస్సులు ధరించి కనిపిస్తున్నారు. ఆ పక్కనే మరో ఇద్దరు టెక్నీషియన్స్ కూడా ఫోటోలో కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటో షేర్ చేసిన చైతన్య గ్రేట్ ఫుల్ అంటూ కామెంట్ చేయగా ఈ ఫోటోని అక్కినేని సమంత షేర్ చేస్తూ యాయ్ యాయ్ యాయ్ అంటూ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

నిజానికి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న పాత్రలో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. కానీ ఆయన డేట్స్ ఖాళీ లేని కారణంగా ఈ సినిమా అవకాశం అక్కినేని నాగ చైతన్యకు దక్కింది. ఇక సమంత కూడా ఈ మధ్యనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 ద్వారా డిజిటల్ స్పేస్ తో పాటు బాలీవుడ్ కి కూడా ఒకే సారి ఎంట్రీ ఇచ్చినట్లయింది. వీరిద్దరికీ బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తుండడంతో వీరిద్దరూ ముంబైలో ఇల్లు కోరుకుంటున్నారని కూడా ప్రచారం మొదలైంది.. అయితే ఆ విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ ప్రస్తుతం లడక్ ప్రాంతంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











