సమంతపై గట్టిగా అరిచేసిన వెన్నెల కిషోర్.. చెప్పేది వినవా? కోపంతో ఊగిపోయిన కమెడియన్
ఇండియాలో టాప్ హీరోయిన్లలో సమంత రుత్ ప్రభు ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. దక్షిణాదిలో అగ్ర హీరోల పక్కన నటించడమే కాకుండా భారీ విజయాలు అందుకొన్నారు. ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఇక వెబ్ సిరీస్‌లతో నార్త్ ఇండియన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొన్నారు. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో సమంత, వెన్నెల కిషోర్ లైవ్‌లో ఛాటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఓ దశలో ఆమెపై వెన్నెల కిషోర్ కోపంతో ఊగిపోయి అరిచేశారు. ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..
సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సమంత నిర్మాతగా తన తొలి చిత్రం శుభం అనే సినిమాను రూపొందించారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత బిజీగా మారారు.

తాను నిర్మాతగా మారడం గురించి సమంత చాలా సంతోషంగా ఉన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలేవీ నాకు అర్థం కాలేదు. ఒక్క రోజు ఒక్క సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత నష్టం వస్తుంది.. డబ్బు ఎంత వృథా అవుతుందో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎంతో మంది టైం వేస్ట్ అవుతుందని అర్థమైంది అని అన్నారు. అయితే విభిన్న రీతిలో ప్రమోషన్స్ చేస్తూ కమెడియన్ వెన్నెల కిషోర్‌తో లైవ్ చాటింగ్ చేసింది.
వెన్నెల కిషోర్‌తో మాట్లాడుతూ.. మే 9వ తేదీన శుభం సినిమా ప్రీమియర్ ఉంది. నీవు కూడా రావాలి. నువ్వు వస్తున్నావు కదా. నా ఫస్ట్ ప్రొడక్షన్. శుభం సినిమా చాలా బాగా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నీవు వచ్చి సినిమాను రివ్యూ చేయాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అందరికీ బాగుంటుంది అంటూ గలగలా మాట్లాడేసింది. సింగిల్ మూవీ నాది రిలీజ్ అవుతుంది అంటుంటే.. నీ ఫ్యామిలీ లేదా? వారిని కూడా పిలువు. వాళ్లు కచ్చితంగా రావాలి. నువ్వు కూడా వస్తున్నావు కదా..నాకు అర్జెంట్ పని ఉంది. నీవు మాత్రం శుభం మూవీ ప్రివ్యూకు రావాలి అంటూ అయితే వెన్నెల కిషోర్ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా బాయ్ బాయ్ అంటూ టాటా చెప్పేసి వెళ్లిపోయింది.
ఇక తాను మాట్లాడుతున్నా సమంత వినకుండా పోవడంపై వెన్నెల కిషోర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అదే రోజు మే 9న నేను నటించిన సింగిల్ సినిమా రిలీజ్ అవుతున్నది. ఆ సినిమాలో నేను సెకండ్ లీడ్. నాది ఫుల్ లెంగ్త్ రోల్. నేను చెబుతున్నా వినడం లేదు. సామ్.. ప్రపంచంతోని సంబంధం లేదు. నీది నీకే. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ శుభం. సింగిల్, శుభం ఒకే రోజు రిలీజ్ అవుతున్నది అని ముఖం చిట్లించుకొంటూ వెన్నెల కిషోర్ చిర్రుబుర్రులాడాడు.
అయితే వారిద్దరి మధ్య సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నది. అయితే ఈ ప్రమోషన్స్ కోసం వారిద్దరూ డ్రామా ఆడారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య జరిగిన వీడియో ఛాటింగ్ ఎవరు లీక్ చేశారు? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ బాగానే జరిగిందనిపించింది.
సమంత దెబ్బకు చిత్తైన వెన్నెల కిషోర్@Samanthaprabhu2 @vennelakishore #Subham #Single pic.twitter.com/Dc3eE0PqNW
— Rajababu Anumula (@Rajababu_a) May 6, 2025


Click it and Unblock the Notifications











