twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బంగార్రాజు’లో సమంత పాత్ర ఖరారైనట్లేనా?

    |

    'మనం' సినిమాలో అక్కినేని ఫ్యామిలీ స్టార్స్ అందరూ కలిసి నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన సమంత ఆ తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా మారిపోయిన సంగతి తెలిసిందే. త్వరలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ మూవీ రాబోతోంది. 'బంగార్రాజు' పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో కూడా సమంత జాయిన్ కాబోతోందట.

    'బంగార్రాజు' మూవీ కోసం కీర్తి సురేష్, పూజా హెగ్డేలను పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చిత్ర బృందం నుంచి ఈ విషయమై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇతర తారాగణం వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తుందా? లేక ఏదైనా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోందా? అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

    Samantha’s role confirmed in Bangarraju?

    'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంతబేనర్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించబోతున్నారు. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న మూవీ ఇది.

    పెళ్లి తర్వాత కూడా సమంత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. అటు పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన తమిళ చిత్రం 'సూపర్ డిలక్స్', తెలుగులో మజిలీ, ఓ బేబీ చిత్రాలు విడుదలయ్యాయి. ఇటీవల విడుదలైన 'మన్మధుడు 2'లో కూడా అతిథి పాత్ర పోషించారు. ప్రస్తుతం '96' రీమేక్‌లో శర్వానంద్‍‌తో కలిసి నటిస్తున్నారు.

    English summary
    After Manam, Nagarjuna and Naga Chaitanya are going to star in a movie called Bangarraju. It seems that Samantha will also star in the movie. Will she be cast as a Female Lead? Or is it going to play any crucial role? Is to be known. The film will be directed by Kalyan Krishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X