సమంత వెబ్ సిరీస్ ట్రైలర్‌కు లైన్ క్లియర్: ముహూర్తం ఫిక్స్ చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్’

ఇండియాలోని పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు అందరూ ఓటీటీల బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించారు. మరికొందరు అదే దారిలో పయనిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన నటీమణులు కూడా డిజిటల్ ప్రపంచంలోకి అడుగెడుతున్నారు. అందులో అక్కినేని సమంత కూడా ఒకరు. గతంలో ప్రసారమై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా వస్తోన్న 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ గురించి ఓ న్యూస్ లీకైంది.

మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. దీన్ని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా వస్తున్న 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌ను జూన్‌ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు దర్శకులు తెలిపారు. అదే సమయంలో త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం.. మే చివరి వారంలో ఇది విడుదల కాబోతుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Samanthas The Family Man 2 Trailer Release Date Fix

ఇదిలా ఉండగా.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో అక్కినేని సమంత టెర్రరిస్టు పాత్రను పోషిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లో ఆమె అదే తరహా గెటప్‌తో కనిపించింది. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X