Samantha: సరిపోయే జోడీ కోసం వెతుకుతున్నా.. అతను చాలా స్మార్ట్.. సమంత పోస్ట్ వైరల్

తెలుగు స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ సమంత ఒకరు. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయి అందరినీ మాయ చేసిన ఈ ముద్దగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో వరుస సినిమాలు, సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది సమంత. ఇక నాగ చైతన్యతో సమంతకు విడాకులు అయిన విషయం తెలిసిందే. సమంత తర్వాత ఎవరినీ పెళ్లి చేసుకుంటుంది అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇలాంటి సమయంలో సమంత తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

డిజాస్టర్ టాక్: టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా ఏదో ఒక చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇటీవల ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత శాకుతంలంతో డిజాస్టర్ అందుకుంది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

Samantha

విజయ్ తో: అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోగా ఓటీటీలో కూడా విడుదలైంది. మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటమితో నిరాశ చెందని సమంత తర్వాతి ప్రాజెక్ట్స్ పై ఫుల్ ఫోకస్ పెడుతోంది. విజయ్ దేవరకొండతో సమంత ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Samantha

రాజ్ అండ్ డీకే దర్శకత్వం: ఖుషీ మూవీ మాత్రమే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటించనుంది. ప్రియాంక చోప్రా చేసిన పాత్రను సామ్ చేయనుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్ర పోషించనున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ ఇండియన్ వెర్షన్ కు దర్శకత్వం వహించనున్నారు.

Samantha

పోస్ట్ వైరల్: ఇక సమంత పర్సనల్ విషయానికొస్తే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సామ్ విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లు విడిపోవడానికి అసలు కారణం ఎవరూ సరిగా చెప్పలేదు. ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకుని సినీ రంగంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత పెట్టిన తాజా పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.

Samantha:

అతను చాలా స్మార్ట్: తాజాగా సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ జ్యువెల్ గమాడియాకు (Dr Jewel Gamadia) సూటెబుల్ మ్యాచ్ కావాలని పోస్టు చేసింది. "డాక్టర్ జ్యువెల్ గమాడియాకు సరైన మ్యాచ్ కోసం వెతుకుతున్నాను. అతను బయటకు కనిపించినదానికంటే చాలా స్టార్ట్. నేను హామీ ఇస్తున్నాను" అని క్యాప్షన్ రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆసక్తికరంగామారింది.

Samantha

ఆక్యుపంక్చర్.. జాబితాలో సామ్: ఇక డాక్టర్ జ్యువెల్ విషయానికొస్తే.. అతను అనుష్క శర్మ, కత్రీనా కైఫ్, అజయ్ దేవగన్ తదితర బీటౌన్ స్టార్ సెలబ్రిటీలందరికీ గో-టు-డాక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అతని దగ్గర చికిత్స పొందిన బాలీవుడ్ సెలబ్రిటీల జాబితా చాలా పెద్దగానే ఉంది. జ్యువెల్ సెలబ్రిటీలకు ఆక్యుపంక్చర్ ఉపయోగించి ట్రీట్మెంట్ ఇస్తాడు. అయితే తాజాగా అతని జాబితాలో సమంత కూడా చేరినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X