'శాకుంతలం'కు ప్రతిష్టాత్మక అవార్డులు.. ఏకంగా 4 విభాగాల్లో.. నెటిజన్ల ట్రోలింగ్

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత మెయిన్ రోల్ లో నటించిన తాజా చిత్రం శాకుంతలం ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. గ్రాఫిక్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ ఇలా అనేక విభాగాల్లో తీవ్ర నెగెటివిటీ తెచ్చుకుంది. ఓటీటీలో కూడా పెద్దగా అలరించని పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఈ సినిమాకు తాజాగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల వెల్లువ నడుస్తోంది. అనేక క్యాటగిరీల్లో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంటూ సత్తా చాటుతోంది.

స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్, కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటించిన చిత్రం శాకుంతలం. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా తెరకెక్కిన శాకుంతలం ఎన్నో వాయిదాల అనంతరం చివరిగా ఏప్రిల్ 14న విడుదలైంది.

Samantha Shaakuntalam Movie Got Cannes 2023 Awards In 4 Categories

శాకుంతలం రిలీజ్ తర్వాత ఊహించని విధంగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. విజువల్ గ్రాఫిక్స్ పై, మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతంపై విమర్శలు వచ్చాయి. దీంతో శాకుంతలం మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ సినిమాకు అవార్డుల పంట వెల్లువిరిసింది. థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ మూవికి అవార్డులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్-2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ గా బహుమతులు దక్కించుకుంది.

తాజాగా ఫ్రాన్సులో జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ సమంత శాకుతలం సినిమా సత్తా చాటుతోంది. ఈ సినిమాకు ఇందులో ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ క్యాటగిరీల్లో అవార్డ్స్ కొల్లగొట్టి విజయకేతనం ఎగురవేసింది. ఈ విషయాన్ని గుణ టీమ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Shaakuntalam

అయితే శాకుంతలం సినిమాకు అవార్డులు రావడం పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతుంటే మరికొంతమంది ఈ సినిమాకు అవార్డులు ఇవ్వడం ఏంటని నెట్టింట్లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరి ప్రేక్షకుల రెజెక్ట్ చేసిన ఈ సినిమాకు ముందు ముందు ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X