Don't Miss!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
February Festival: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒక్కరోజే 6 సినిమాలు.. ఫిబ్రవరిలో సినీ జాతర!
బ్యూటిఫుల్ సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందరినీ మాయ చేసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వంటి వెబ్ సిరీస్ లో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఏకంగా హాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు వెళ్లిపోయింది సామ్.
ప్రస్తుతం లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల యశోద మూవీతో అదరగొట్టింది. సామ్ చేసిన మరో మూవీ శాకుంతలం ఇప్పటికీ అనేకసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సామ్. యశోద సినిమాతో పాటు ఏకంగా 6 క్రేజీ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా!

శాకుంతలం
సమంత అభిమానులకు ఇటీవల యశోద సినిమాతో సూపర్ ట్రీట్ ఇవ్వగా మరోసారి ఎంటర్టైన్ చేయనుంది. సామ్ నటించిన మరో లేడీ ఒరియెంటెడ్ మూవీ శాకుంతలం. ఈ సినిమాకు పాపులర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా అనేకసార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి సమంత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పాన్ ఇండియా సినిమాను ఫ్రిబవరి 17న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

సార్
పేరుకు కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. విభిన్నమైన, విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరు, నేనే వస్తున్నా సినిమాలతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన ధనుష్ నటిస్తున్న తెలుగు, తమిళం బైలింగువల్ చిత్రం సార్. తమిళంలో వాతిగా వస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

ధమ్కీ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. విశ్వక్ సేన్ మరోసారి నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ధమ్కీ. గ్లామరస్ బ్యూటి నివేదా పేతురాజ్ హీరోయిన్ గా విశ్వక్ సేన్ సరసన నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఫిభ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ చిత్రం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వినరో భాగ్యము విష్ణు కథ
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో రానున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

మైదాన్
ఇప్పటికీ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చాయి. ఇటీవల బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఝండ్ మూవీతో అలరించారు. ఇప్పుడు మైదాన్ సినిమాతో స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆడియెన్స్ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అమిత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా ఫిబ్రవరి 17న ప్రేక్షకులు ముందుకు రానుంది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషించింది.

యాంట్ మ్యాన్ 3
మార్వెల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్', 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీవర్స్', 'థోర్: లవ్ అండ్ థండర్', 'బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్' చిత్రాలతో అలరించగా.. తాజాగా మరో సీక్వెల గా 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటామేనియా' రాబోతుంది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఇలా ఫిబ్రవరి 17 ఒక్క రోజునే ఏకంగా 6 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అంటే మిగతా ఐదు చిత్రాలతో సమంత శాకుంతలం సినిమా పోటి పడనుంది.