సింపుల్ గట్టి ఆన్సర్ ఇచ్చిన సమంత.. చైతు రెండో పెళ్లి కోసమేనా..

రీసెంట్ గా గత కొన్ని రోజులు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల యువతలో బాగా హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో యువ హీరో రాజ్ తరుణ్ అలాగే తన మాజీ లవర్ లావణ్యల కేసు ఒకటి అయితే ఇది ఇలా కొనసాగుతున్న సమయంలో దీనికి మించి సెన్సేషనల్ ని సెట్ చేసింది మాత్రం అక్కినేని వారు యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి కోసం అని చెప్పాలి.

నాగ చైతన్య అలాగే ప్రముఖ నటి శోభిత ధూళిపాళలు వివాహ బంధంతో ఒకటి కానున్నారు అని ఫిక్స్ అయ్యింది. కానీ ఈ సమయంలో నాగ చైతన్య మాజీ భార్య పాన్ ఇండియా నటి సమంత కోసం కూడా చర్చ మొదలైంది. ఎప్పుడో రెండేళ్ల కితం విడాకులు తీసుకున్న వీరిపై మళ్ళీ మొత్తం ఫ్రెష్ రూమర్స్ మొదలయ్యాయి. వీరు విడిపోడానికి కారణం ఇది అదీ అని నాగ చైతన్య ఇపుడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని ఇలా చాలానే వచ్చాయి.

samantha strong counter with simple quote goes viral

కాగా ఇంకో పక్క ఇంత హడావుడి జరుగుతున్నా కూడా సమంత మాత్రం చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతెందుకు చైతు శోభితల అనౌన్సమెంట్ వచ్చిన రోజు కూడా సామ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు ఇద్దరికీ సంబంధం లేనట్టుగానే సోషల్ మీడియాలో తన పని తాను చేసుకుంది.

దీనితో ఈ మేటర్ ని సమంత పెద్దగా పట్టించుకోవడం లేదు అని చాలా మంది అనుకుంటున్న సమయంలో తనది లేటెస్ట్ పోస్ట్ ఒకటి ఇప్పుడు చర్చకు దారి తీసింది. కాగా తాను వేసుకున్న ఓ తీ షర్ట్ పై ఉన్న కొటేషన్ ఆసక్తిగా మారింది. "నేను శాంతికి నిశ్శబ్దానికి ఒక మ్యూజియం" లాంటి దానిని అన్నట్టుగా ఒక బ్రౌన్ టీ షర్ట్ ని ఆమె ధరించి కనిపించింది.

దీనితో పరోక్షంగా తనని ట్రోల్స్ చేస్తున్న వారికీ అలాగే నాగ చైతన్యకి కూడా ఈమె సింపుల్ గా ఇవ్వాల్సిన ఆన్సర్ ని గట్టిగా ఇచ్చింది అని సామ్ అభిమానులు అనుకుంటున్నారు. కాగా ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లో వైరల్ గా మారిపోయింది. మరి ఇది సమంత వాంటెడ్ గా పెట్టిందా లేక తన నార్మల్ డ్రెస్సింగ్ అనేది తనకే తెలియాలి. కానీ కొటేషన్ మాత్రం ఎవరినో కొట్టేలానే ఉందని ఇప్పుడు అందరిలో వైరల్ గా మారింది.

ఇక సామ్ అయితే ప్రస్తుతం పలు చిత్రాలు వెబ్ సిరీస్ లతో యమ బిజీగా ఉండగా ఆమె నటించిన అవైటెడ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" అమెజాన్ ప్రైమ్ వీడియోలో అతి త్వరలోనే స్ట్రీమింగ్ కి రానుంది. ఇది హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా తెరకెక్కించగా దీనిని ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించారు. అలాగే అమెజాన్ లో అయితే ఈ సిరీస్ నవంబర్ 7న రిలీజ్ కి రానుంది. అలాగే ఇది పాన్ ఇండియా భాషల్లో రావచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X