సమంత ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది!
సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సమంత తన ట్విట్టర్ పేజీ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ... సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను విష్ చేశారు. 55 ఏళ్ల లెజెండరీ జర్నీ... ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
'ఓ బేబీ' చిత్రంలో స్వాతి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సమంత తెలిపారు. ఈ సినిమాలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు... ఎంజయ్ చేయడానికి రెడీగా ఉండండి అని సమంత పేర్కొన్నారు. ఈ పోస్టర్‌కు సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
'ఓ బేబీ' చిత్రంలో సమంత డెబ్బై ఏళ్ల ముసలమ్మ పాత్రలో... 20 యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ఉండబోతోందని టాక్.

ఈ చిత్రంపై సమంత భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ గురించి ఆమె గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. చాలా ప్రత్యేకమైన చిత్రం. నాకెంతో నచ్చిన పాత్రలో నటించాను. డైరెక్టర్ నందినీ రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారని తెలిపారు.
'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేష్ బాబు, సునీత తాటి, టిజి విశ్వప్రసాద్, హ్యూనవూ థామస్ కిమ్ నిర్మాతలు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ఇంకా నాగ శౌర్య, లక్ష్మీ, రావు రమేష్, ప్రగత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











