యూ టర్న్ ట్రైలర్: ఈ ఐదు రోజులు జరిగింది నిజామా అబద్దమా ? సమంత జీవించిందిగా!
సమంత కెరీర్ లో ఈ ఏడాదిని గోల్డెన్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. సమంత నటిస్తున్న చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. రంగస్థలం, అభిమన్యుడు, మహానటి చిత్రాల్లో ఈ ఏడాది సమంత నటించింది. ఆ మూడు చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యూ టర్న్. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
కన్నడలో సూపర్ హిట్ అయిన యూ టర్న్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ఈయూ రోజులు జరిగింది నిజమా అబద్దమా అంటూ సమంత డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఎదో మర్డర్ కు సంబందించిన దర్యాప్తు చేపట్టే పోలీస్ గా ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మరొక పాత్రలో రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నాడు. భూమికని ట్రైలర్ లో కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే చూపించారు. భూమిక పాత్ర ఏంటనే ఉత్కంఠ పెరిగింది. సమంత విలక్షణ నటనతో మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా యూ టర్న్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.



Click it and Unblock the Notifications











