సమంత ‘యూ టర్న్’ రిలీజ్ డేట్ ఖరారు
సమంత, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో పవన్ కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'యూ టర్న్'. ఈ మూవీ విడుదల తేదీ సెప్టెంబర్ 13న ఖరారైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమిళం, తెలుగులో కలిపి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఒకేరోజు విడుదల కానుంది. కన్నడలో 'యూ టర్న్' మూవీ సూపర్ హిట్ కావడంతో అదే పేరుతో ఈ మూవీని రెండు బాషల్లో రీమేక్ చేస్తున్నారు.

ఒక ఫ్లైఓవర్ మీద జరిగే యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ యాక్సిడెంటులో భూమిక మరణించి దెయ్యంగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.
సమంత, ఆదితో పాటు రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు యు టర్న్ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











