‘మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశా’.. దూకుడు పెంచిన సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే భారీ పాపులరిటీని సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను అందుకుంది సమంత. తాజాగా ఈ హీరోయిన్ దూకుడు పెంచింది. మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

స్టార్ హీరోయిన్ సమంత 'ఏం మాయ చేసావే' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే.. తన అందం, అభినయంతో మెస్మరైస్ చేసి కోట్లాది మంది ప్రేక్షకులకు సొంతం చేసుకుంది.

Samantha Up coming Web series Rakht Brahmand is shooting for another Netflix series

తన కెరీర్ పిక్ స్టేజ్ లో ఉండగానే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, వీరి వివాహం మూడు నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని, ఫ్యాన్స్ కే కాదు.. సినీ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె అదృష్టం అంత బాగాలేదు. విడాకుల అనంతరం ఆమె మయోటిసిస్ అనే అరుదైన బారిన పడింది.దీంతో దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుసగా లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ చేస్తూ బిజీబిజీగా మారింది.

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత విన్నూత స్టోరీలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడిపోయింది. ఇటీవల సమంత నటించిన సిటాడెల్: హనీ బన్నీ(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)వేదికన స్ట్రీమింగ్ అవుతోంది. పాజివిట్ టాక్ తో దూసుకుపోతుంది. సమంత తనలోని మరో కోణాన్ని బయటపెట్టి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది.

Samantha Up coming Web series Rakht Brahmand is shooting for another Netflix series

తాజాగా ఈ హీరోయిన్ రక్త్‌బ్రహ్మాండ్(RakhtBrahmand) అనే మరో వెబ్‌ సిరీస్‌తో ముందుకు వస్తుంది. ఈ సిరీస్ కు రాహి అనిల్ బార్వే(Rahi Anil Barve) దర్శకత్వంలో వస్తున్నారు. వరుస విజయాలను అందుకుంటున్న సమంత ఈ సిరిస్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా.. తాజాగా సమంత సిరీస్ గురించి సోషల్ మీడియా వేదికలో వైరల్ అవుతున్నాయి. 'రక్త్‌బహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సెట్ లోకి అడుగుపెట్టామని తెలిపింది. యాక్షన్ సీక్వెల్ గా వస్తున్న ఈ సీరిస్ ఓ ఫొటో పంచుకుంది. సమంత ఇచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X