Kushi Trailer: మన జంట ఏంటో లోకానికి చూపిద్దాం.. నా పిల్ల.. అదిరిపోయిన ఖుషి ట్రైలర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా ఏదో ఒక చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇటీవల ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేసిన సమంత శాకుతంలంతో డిజాస్టర్ అందుకుంది. ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలని కొత్త సినిమాపై హోప్స్ పెంచుకుంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇదివరకే ఖుషి (Kushi 2023) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఖుషి సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మొదటి నుంచి క్రేజీ విషయంగా మారింది. అలాగే మంచి అంచనాలు పెరిగాయి. అందుకు తగినట్లుగానే టర్కీ సహా పలు దేశాలు, ప్రాంతాల్లో షూటింగ్ కు సంబంధించిన వీడియోలు ఆసక్తి కలిగించాయి.

అంతేకాకుండా ఖుషి సినిమా నుంచి విడుదలైన పోస్టర్లతోపాటు టైటిల్ సాంగ్, నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ పాటలతో హిట్ ఆల్బమ్ గా పేరు తెచ్చుకుంది. ఇందులో సామ్ ముస్లిం యువతిలా కనిపించి ఆకర్షించింది. ఇక ఈ సినిమా పోస్టర్స్ కు మంచి ఆదరణ పెరిగింది. ఇటీవల ట్రైలర్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ, సమంత రొమాంటిక్ పోజు ఆకట్టుకుంది. ఇక ఆగస్టు 9న అంటే ఇవాళ ఖుషి ట్రైలర్ (Kushi Trailer) రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఖుషి మేకర్స్ చెప్పిన 3 గంటల సమయానికి కాకుండా కాస్తా ఆలస్యంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సుమారు 2 నిమిషాల 41 సెకన్ల నిడివితో ఉన్న ఖుషి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. విప్లవ్, ఆరాధ్య పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని బాండింగ్ కోసం ఎదుర్కొనే సమస్యలను ట్రైలర్ లో చూపించారు. మన జంట ఎంత బాగుంటుందో ఈ లోకానికి చూపిద్దాం, భర్త ఎలా ఉండాలో చూపిస్తా, నేను స్త్రీ పక్షపాతిని, నా పిల్ల (అర్జున్ రెడ్డి స్టైల్) అనే డైలాగ్స్ సూపర్బ్ గా ఉన్నాయి.
సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఖుషి సినిమాలో జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











