Don't Miss!
- Sports
రియాన్ పరాగ్ ఫీల్డింగ్ మస్తుందిగా.. అతని జోష్ అదిరిపోయిందన్న శ్రీలంకన్ స్టార్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Yashoda గా సమంత జోరు.. క్రేజీ న్యూస్ చెప్పిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకొన్న సమంత రుత్ ప్రభు.. భారీ, క్రేజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ ద్వారా మరోసారి ప్యాన్ ఇండియా ఆడియెన్స్ మనసు దోచుకొన్నారు. ఆమె నటించిన శాకుంతలం, తమిళంలో కాథూ వాకులా రెండు కాదల్ చిత్రాలు రిలీజ్ సిద్దమవుతున్నాయి. ఈ రెండు చిత్రాలతోపాటు యశోద అనే సంచలనాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యశోద సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు (గురువారం, జనవరి 6) సెకండ్ షెడ్యూల్ మొదలైంది.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం" అని చెప్పారు.
నటీనటులు:
సమంత,
వరలక్ష్మీ
శరత్
కుమార్,
ఉన్ని
ముకుందన్,
రావు
రమేష్,
మురళీ
శర్మ,
సంపత్
రాజ్,
శత్రు,
మధురిమ,
కల్పికా
గణేష్,
దివ్య
శ్రీపాద,
ప్రియాంకా
శర్మ
తదితరులు
దర్శకత్వం:
హరి
-
హరీష్,
నిర్మాత:
శివలెంక
కృష్ణప్రసాద్.
సంగీతం:
మణిశర్మ
మాటలు:
పులగం
చిన్నారాయణ,
డా.
చల్లా
భాగ్యలక్ష్మి
పాటలు:
రామజోగయ్య
శాస్త్రి
క్రియేటివ్
డైరెక్టర్:
హేమంబర్
జాస్తి
కెమెరా:
ఎం.
సుకుమార్
ఆర్ట్:
అశోక్
ఫైట్స్:
వెంకట్
ఎడిటర్:
మార్తాండ్
కె.
వెంకటేష్
లైన్
ప్రొడ్యూసర్:
విద్య
శివలెంక
సహ
నిర్మాత:
చింతా
గోపాలకృష్ణారెడ్డి