For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Family Man 2 నుంచి గుడ్ న్యూస్: సమంత అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన టీమ్

  |

  కరోనా ప్రభావం వల్ల థియేటర్లు మూతపడడంతో ఇండియా మొత్తంగా ఓటీటీ సంస్థల హవా కనిపిస్తోంది. సినిమాలకు సెన్సార్ ఉన్నట్లు ఓటీటీలో వచ్చే కంటెంట్‌కు ఎలాంటి హద్దులు లేకపోవడంతో ఇందులో స్ట్రీమింగ్ అయ్యే ప్రతి దానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఓటీటీల బాట పడుతున్నారు. అదే సమయంలో హీరో, హీరోయిన్లు కూడా ఓటీటీ సంస్థల కోసం నటిస్తున్నారు. తెలుగు పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికే డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టారు. అందులో అక్కినేని సమంత కూడా ఒకరు.

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించిన అక్కినేని సమంత.. ఇటీవలే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. దీన్ని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా వచ్చిందే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సిరీస్‌కు దేశంలోని అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

  Samanthas The Family Man 2 Telugu and Tamil Streaming Start

  'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. మరో ముఖ్యమైన రోల్‌లో నటించిన అక్కినేని సమంత మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె చేసిన రాజీ అనే క్యారెక్టర్ హైలైట్ అయింది. ఇందులో బోల్డుగా కనిపిస్తూనే ఎన్నో సాహసాలు చేసిన సమంతపై విమర్శలే ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఫలితంగా ఆమెకు మరిన్ని ఓటీటీ ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఈ రంగంలో సమంత ఆచితూచి అడుగులు వేయాలని డిసైడయింది.

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్: యాంకర్ ప్రదీప్ పరువు తీసేసిన సీరియల్ నటి

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. దీంతో తమిళం, తెలుగులో ఎక్కువగా ఉండే అక్కినేని సమంత అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఆయా భాషల్లోనూ వస్తుందని ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందుకు అనుగుణంగానే సామ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' తెలుగు, తమిళం స్ట్రీమింగ్ ఆగస్టు 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది.

  Samanthas The Family Man 2 Telugu and Tamil Streaming Start

  ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఉత్తమ నటనతో పలు అవార్డులు అందుకున్న అక్కినేని సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు గానూ మరో అరుదైన ఘనత దక్కింది. ఇటీవలే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' డిజిటల్ రంగానికి సంబంధించిన ఉత్తమ నటి, నటుడు అవార్డులను ప్రకటించింది. ఇందులో 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నటనకు గానూ సమంతకు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. దీనిపై ఈ బ్యూటీ ఫుల్ ఖుషీగా ఉంది.

  English summary
  Samantha Akkineni Entry to Digital World with The Family Man 2 Web Series. This Series Telugu and Tamil Straming Started in Amazon Prime.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X