టాలీవుడ్ యువ నటుడు మృతి.. షాక్‌లో సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ
Recommended Video
టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. యువ నటుడు అమిత్ పురోహిత్ మృతి చెండాడనే వార్త విని షాకవుతున్నారు ప్రేక్షకులు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ యంగ్ హీరో సుధీర్‌బాబు ట్వీట్ చేయడంతో అమిత్ పురోహిత్ మృతి చెందాడనే వార్త బయటకు వచ్చింది. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సమ్మోహనం సినిమాలో సమీరా బాయ్ ఫ్రెండ్
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సమ్మోహనం సినిమాలో సమీరా (అదితీరావు హైదరీ) బాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు అమిత్ పురోహిత్. ఈ చిత్రంలో అమిత్ మల్హోత్రా పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా సడెన్‌గా అమిత్ పురోహిత్ మృతి చెందాడనే వార్త టాలీవుడ్ వర్గాలను షాక్‌కి గురి చేసింది.
సుదీర్ బాబు ఆవేదన
అమిత్ పురోహిత్ మృతి చెందాడని తెలుపుతూ సమ్మోహనం హీరో సుదీర్ బాబు ట్వీట్ పెట్టాడు. ఎప్పుడు స్నేహంగా ఉండే ఆయన మృతి చెందాడనే వార్త తనకు తీవ్రంగా బాధించిందని సుదీర్ బాబు పేర్కొన్నాడు. ప్రతి షాట్‌కూ 100 శాతం న్యాయం చేసే నటుడని, ఎంతో టాలెంట్ ఉన్న ఆయన మృతి చెందటం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అమిత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సుదీర్ బాబు పేర్కొన్నాడు.
నమ్మలేక పోతున్నా.. మోహన్ ఇంద్రగంటి
అమిత్ మృతి చెందాడంటే నమ్మలేక పోతున్నానని మోహన్ ఇంద్రగంటి పేర్కొన్నాడు. తాను పని చేసిన నటుల్లో ఎంతో టాలెంట్ ఉన్న నటుడు అమిత్ అని తెలుపుతూ, ఆయన మరణించాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని ఇంద్రగంటి మోహన్ కృష్ణ ట్వీట్ చేశారు. తన నెక్ట్స్ సినిమాకు అమిత్‌ను తీసుకోవాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు.

అమిత్ పురోహిత్ మృతి వివరాలు
కాగా అమిత్ పురోహిత్ మరణం పట్ల పూర్తి వివరాలు తెలియరాలేదు. సుదీర్ బాబు ట్వీట్ ద్వారానే అమిత్ మరణించాడని తెలుసుకున్నారు. అమిత్ పురోహిత్ తెలుగులో సమ్మోహనం సినిమాతో పాటు హిందీలో పంక్, ఆలాప్ వంటి సినిమాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications











