Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దానికే అడిక్ట్ అయిపోయా.. నిద్ర పట్టదేమో అనిపిస్తుంది.. అదితీరావు హైదరీ
తన అందచందాలతో వెండితెరను సమ్మోహన పరిచింది హైదరాబాద్ బ్యూటీ అదితీరావు హైదరీ. మోడల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2006 సంవత్సరంలో సినీ గడప తొక్కింది. కార్తి నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'చెలియా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు సినిమాల్లో అందాలు ఆరబోసినప్పటికీ పెద్దగా ఆమెకైతే ప్రయోజనం దక్కలేదు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'సమ్మోహనం' సినిమా మాత్రమే ఆమె కెరీర్ లో కాస్త చెప్పుకోదగింది. అన్ని అర్హతలున్నా అదృష్టం మాత్రం ఆమడ దూరంలోనే ఉన్న అదితీరావు హైదరీ ప్రస్తుతం ఉత్తరాదిన వరుస సినిమాలు చేస్తోంది.
ఇటీవలే అంతరిక్షం అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో తెలుగు తెరపై డిఫెరెంట్ రోల్ పోషించిన అదితీరావు హైదరీ ఆ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. నటిగా ఇంకా ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటా అని చెబుతున్న ఈ భామ తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తనకు, తన కెరీర్‌కి సంబందించిన విషయాలపై స్పందించింది. అంతరిక్షం సినిమా తనకు ఓ మంచి అనుభూతిని మిగిల్చిందని, అలాగని ఆ సినిమా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా తన గత చిత్రం అంతరిక్షం మూవీపై తన అభిప్రాయం తెలిపింది.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా మీరు నటి కాకపోయుంటే.. ఏమై ఉండేవారు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది అదితీరావు హైదరీ. ''ఏమయ్యేదాన్నో ఊహించడం కొంచెం కష్టమే! నటించాలన్న కోరిక చిన్నతనం నుంచే నాలో బలంగా ఉంది. అలాగని ఫుల్లుగా సినిమాలు చూసేదాన్ని కూడా కాదు. కానీ ఎందుకో నటనంటే ఓ ఇష్టం ఏర్పడింది. నటిని అయ్యాను. ఇప్పుడైతే ఒక్కరోజు కెమెరా ముందు నిలబడకపోతే నిద్ర పట్టదేమో అనిపిస్తుంది. నేను నటనకి అంత అడిక్ట్ అయిపోయాను. ఇప్పటికల్లా సినిమానే నా ప్రపంచం తప్ప నా కంటూ వేరే ప్రపంచం లేనే లేదు'' అని తెలిపింది.