twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దానికే అడిక్ట్ అయిపోయా.. నిద్ర పట్టదేమో అనిపిస్తుంది.. అదితీరావు హైదరీ

    |

    తన అందచందాలతో వెండితెరను సమ్మోహన పరిచింది హైదరాబాద్ బ్యూటీ అదితీరావు హైదరీ. మోడల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2006 సంవత్సరంలో సినీ గడప తొక్కింది. కార్తి నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'చెలియా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు సినిమాల్లో అందాలు ఆరబోసినప్పటికీ పెద్దగా ఆమెకైతే ప్రయోజనం దక్కలేదు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'సమ్మోహనం' సినిమా మాత్రమే ఆమె కెరీర్ లో కాస్త చెప్పుకోదగింది. అన్ని అర్హతలున్నా అదృష్టం మాత్రం ఆమడ దూరంలోనే ఉన్న అదితీరావు హైదరీ ప్రస్తుతం ఉత్తరాదిన వరుస సినిమాలు చేస్తోంది.

    ఇటీవలే అంతరిక్షం అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో తెలుగు తెరపై డిఫెరెంట్ రోల్ పోషించిన అదితీరావు హైదరీ ఆ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. నటిగా ఇంకా ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటా అని చెబుతున్న ఈ భామ తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తనకు, తన కెరీర్‌కి సంబందించిన విషయాలపై స్పందించింది. అంతరిక్షం సినిమా తనకు ఓ మంచి అనుభూతిని మిగిల్చిందని, అలాగని ఆ సినిమా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా తన గత చిత్రం అంతరిక్షం మూవీపై తన అభిప్రాయం తెలిపింది.

    Sammohanam beauty Aditi Rao Hydari spoke about her interests

    ఇక ఇంటర్వ్యూలో భాగంగా మీరు నటి కాకపోయుంటే.. ఏమై ఉండేవారు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది అదితీరావు హైదరీ. ''ఏమయ్యేదాన్నో ఊహించడం కొంచెం కష్టమే! నటించాలన్న కోరిక చిన్నతనం నుంచే నాలో బలంగా ఉంది. అలాగని ఫుల్లుగా సినిమాలు చూసేదాన్ని కూడా కాదు. కానీ ఎందుకో నటనంటే ఓ ఇష్టం ఏర్పడింది. నటిని అయ్యాను. ఇప్పుడైతే ఒక్కరోజు కెమెరా ముందు నిలబడకపోతే నిద్ర పట్టదేమో అనిపిస్తుంది. నేను నటనకి అంత అడిక్ట్‌ అయిపోయాను. ఇప్పటికల్లా సినిమానే నా ప్రపంచం తప్ప నా కంటూ వేరే ప్రపంచం లేనే లేదు'' అని తెలిపింది.

    English summary
    Sammohanam beauty Aditi Rao Hydari spoke about her interests in latest interview. She said cinema is a life for her. No more greater then cinema she told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X