ఇక కూత, ఆట మొదలౌతుంది!.. సంపత్ నంది ట్వీట్ వైరల్

ఓ వైపు దర్శకుడిగా మరో వైపు నిర్మాతగా బిజీగా ఉన్నాడు సంపత్ నంది. అయితే కరోనా కారణంగా సీటీమార్ సినిమా చాలా వాయిదా పడింది. లాక్ డౌన్ తరువాత మళ్లీ సినిమా మొదలెట్టినా కూడా తమన్నా కరోనా బారిన పడటంతో అంతా క్యాన్సిల్ అయితే మళ్లీ సంపత్ నంది షూటింగ్ మొదలెట్టే ప్లానింగ్‌లో ఉన్నాడు. షూటింగ్ కోసం మంచి లొకేషన్లను వెదికిపట్టే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఈ మేరకు సంపత్ నంది చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

సీటీమార్ షూటింగ్ కోసమే తమన్నా హైద్రాబాద్‌కు వచ్చింది. కానీ కరోనా సోకడంతో షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ మామూలు పరిస్థితికి రావడంతో కబడ్డీ ఆట ఆడించేందుకు సరైన లొకేషన్‌ను సంపత్ నంది వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఈ విషయంలో త్వరలోనే ఓ అప్డేట్ ఇస్తానని సంపత్ నంది ట్వీట్ చేశాడు. షూటింగ్ లొకేషన్ కోసం రెక్కీ నిర్వహిస్తున్నానని ప్రకటించాడు.

 Sampath Nandi About Seetimaarr Shooting

అవును మాకు షూటింగ్ జరుపుకోవడానికి సరైన లొకేషన్ దిరికింది.. షూటింగ్ అప్డేట్స్ త్వరలోనే ఇస్తానని సంపత్ నంది తెలిపాడు. ఇక కూత, ఆట మొదలవుతుంది అంటూ ట్వీట్ చేశాడు. సీటిమార్‌లో గొపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా దిగంగనా, భూమి, రెహమాన్, తరుణ్ అరోరా వంటి నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలను అందిస్తున్నాడు. సంపత్ నంది సీటీమార్ కాకుండా బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలతోనూ బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X