సీటీమార్ టీజర్ రాబోతోంది.. సంపత్ నంది ట్వీట్ వైరల్
గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో రాబోతోన్న సీటీమార్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇంతకుముందు వీరి కాంబోలో గౌతమ్ నందా అనే మాస్ మూవీ వచ్చింది. అది ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మాత్రం రూట్ మార్చి స్పోర్ట్స్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మామూలుగా అయితే గతేడాదే సినిమా విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా పడాల్సి వచ్చింది.
అయితే మొత్తానికి సీటీమార్ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. సమ్మర్‌లో కూత పెట్టేందుకు రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అలా తాజాగా సంపత్ నంది సీటీమార్ గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. మీ లానే నేను కూడా ఎదురుచూస్తున్నానని చెబుతూ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. షూటింగ్ చకచకా జరుగుతున్నప్పుడు దిగిన స్టిల్‌ను షేర్ చేస్తూ అప్డేట్ ఇచ్చాడు సంపత్ నంది.

సీటీమార్ ప్రతీ ఫ్యాన్ టీజర్ అప్డేట్ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో నాక్కూడా తెలుసు.. ఎందుకంటే నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను.. మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. ఇక కౌంట్ డౌన్ ప్రారంభం అంటూ సంపత్ నంది చెప్పుకొచ్చాడు. తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తోన్న ఈ మూవీలో తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











