అదిరిపోయే సెట్.. ఊర్వశీతో ఐటెం సాంగ్ అంటోన్న సంపత్ నంది
ప్రస్తుతం టాలీవుడ్‌లో షూటింగ్‌ల సందడి నెలకొంది. చిన్న చిన్న సినిమాలన్నీ సెట్స్‌పైకి వెళ్తున్నాయి. దాదాపు ఆగిపోయిన అన్ని ప్రాజెక్ట్‌లు.. షూటింగ్‌లను పున: ప్రారంభించాయి. ఇక పెద్ద సినిమాలు కూడా రంగంలోకి దిగబోతోన్నాయి. అయితే భారీ బడ్జెట్ చిత్రాలను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇక మీడియం, చిన్న సినిమాలు మాత్రం ఇప్పటికే సెట్స్ పైకి వచ్చాయి.
అందులో భాగంగా సంపత్ నంది నిర్మిస్తోన్న ఓ చిత్రం సెట్స్ పైకి వచ్చింది. సంపత్ నంది అందించిన కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా నటిస్తోంది. ప్రస్తుతం ఈమెపై అదిరిపోయే ఐటెం సాంగ్ కంపోజ్ చేయబోతోన్నట్టు తెలిపాడు. ఈ మేరకు వేసిన సెట్టు, అక్కడి సెటప్ గురించి సోషల్ మీడియాలో అందరికీ చెప్పుకొచ్చాడు. ఈ ఐటెం నంబర్‌ను జానీ మాస్టర్ కంపోజ్ చేయబోతోన్నాడని పేర్కొన్నాడు.

ఈ మేరకు సంపత్ నంది చేసిన పోస్ట్, షేర్ చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది. నా సినిమాటోగ్రఫర్ సౌందర రాజన్ ఎఫ్పుడూ తన లైట్స్‌తో ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. దానికి ఇదే నిదర్శనం.బ్లాక్ రోజ్ పటాకా లాంటి సాంగ్‌ను అందాల తార ఊర్వశీ రౌటేలాతో షూట్ చేయబోతోన్నాం. ఆ సెట్ నుంచి తీసిన ఫోటోనే ఇది. రచ్చ సినిమాలో ధిల్లకు ధిల్లకు అనే సూపర్ సాంగ్‌ను కంపోజ్ చేసిన జానీ మాస్టర్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేయబోతోన్నాడు.ఆచార్య సత్యనారాయణ అదిరిపోయే సెట్ వేశాడు, ఈ అద్భుతమైన పాటను మణిశర్మ అందించాడంటూ సంపత్ నంది పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











