డబ్బైనా పోవాలి శత్రువైనా రావాలి.. ఊర్వశీ రౌటేలా పోస్టర్ వైరల్
ఏమైంది ఈవేళ సినిమాతో ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్నాడు సంపత్ నంది. రెండో సినిమాకే మెగా కాంపౌండ్లో పడటం రామ్ చరణ్ వంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేసే అవకావం రాడం మామూలు విషయం కాదు. అయితే వచ్చిన ఆ అవకాశంతో నిజంగానే 'రచ్చ' చేశాడు. ఆపై చాలా గ్యాప్ తరువాత బెంగాల్ టైగర్ సినిమాతో మెప్పించాడు. అయితే సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువగా ఉండటంతో సంపత్ నంది వెనకబడినట్టు అనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ డైరెక్టర్ అందిస్తోన్న కథతో బ్లాక్ రోజ్ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ మధ్యే ఈమెపై అదిరిపోయే ఐటెం సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ మేరకు వేసిన సెట్టు, అక్కడి సెటప్ గురించి సోషల్ మీడియాలో సంపత్ నంది షేర్ చేశాడు. జానీ మాస్టర్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టాని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఊర్వశీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. కార్పోరేట్ మోసాలు, అప్పులు ఇస్తే వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పే సినిమా ఇది అని తెలిసిపోతోంది. డబ్బు అప్పుగా ఇస్తే.. మీరు డబ్బునైనా కోల్పోతారు లేదా.. శత్రువునైనా తెచ్చుకుంటారు అని పోస్టర్‌పై రాసి ఉంది. ఇక ఊర్వశీ ఎంతో హుందాగా టైటిల్‌కు తగ్గట్టు నలుపు, ఎరుపు రంగులో చీరకట్టుకుని నడిచివస్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే బ్లాక్ రోజ్ అందర్నీ ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











