కూత మొదలు.. సీటీమార్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
దర్శకుడిగా మంచి విజయాలే అందుకున్నాడు సంపత్ నంది. బెంగాల్ టైగర్, గౌతమ్ నందా అంటూ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టున్నాడు. కానీ సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నాడు. అందుకే మళ్లీ గోపీచంద్‌తో ఓ ప్రయోగం చేసేందుకు సిద్దమయ్యాడు. క్రీడా నేపథ్యంలో గోపీచంద్, తమన్నాలతో సీటీమార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికే సినిమా పూర్తయ్యేది.
కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ అన్ లాక్ ప్రక్రియ తరువాత షూటింగ్‌కు రెడీ అవుతూ ఉంటే తమన్నాకు కరోనా వచ్చింది. దాంతో మరింత ఆలస్యమైంది. అవును మాకు షూటింగ్ జరుపుకోవడానికి సరైన లొకేషన్ దొరికింది.. షూటింగ్ అప్డేట్స్ త్వరలోనే ఇస్తానని ఆ మధ్య చెప్పాడు. అప్పుడు చెప్పినట్టుగానే తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు. దీపావళి సందర్బంగా సీటీమార్ అప్డేట్ ఇచ్చాడు.

చాలా రోజుల వామ్ అప్ తరువాత ఒళ్లు విరుచుకుని ఫుల్ ప్రాక్టీస్ చేసి వస్తున్నాము.. అందరూ ఫిట్‌గా రెడీ అయ్యారు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సెట్‌లోకి అడుగుపెట్టబోతోన్నాం.. ఎదురుచూపులకు తెరదీశాం.. కూత మొదలు.. నవంబర్ 23 నుంచి.. కబడ్డి కబడ్డి కబడ్డి అనే కూత ఆగదు అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో దిగంగనా, భూమి, రెహమాన్, తరుణ్ అరోరా వంటి నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలను అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











