ఫస్ట్ నైట్ అక్కడే ఎందుకు? .. మంచం ఎక్కితే .. రిపోర్ట్‌కు డైరెక్టర్ షాకింగ్ రిప్లై
సినిమాలు తీయడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కోశైలి. కొందరు యాక్షన్ సీన్లు బాగా తీస్తే.. మరికొందరు సెంటిమెంట్, ఇంకొందరు కామెడీ సీన్లను బాగా తీస్తారు. ఎవరెలా తీసినా ఇండస్ట్రీకి ఫైనల్‌గా కావాల్సింది మంచి హిట్. ఇందుకోసమే అందరి ఆరాటం, ప్రయత్నం. కాకపోతే చేసే పనిలో స్పెషల్ సిగ్నేచర్ ఉండటమన్నది ఏ వృత్తిలోనైనా సెపరేట్ గుర్తింపును తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే దర్శకుడు సంపత్ నందికి ఓ విలేకరి అడిగిన ప్రశ్న షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
గతంలో హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కించిన చిత్రం ఓదెల 2. సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలకపాత్ర పోషించగా.. వశిష్ట సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మలు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై డీ. మధు, సంపత్ నందిలు ఈ చిత్రాన్ని దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

భారీ ఎత్తున నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు, టీజర్, ట్రైలర్ల కారణంగా ఓదెల 2 సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. దీనికి తగినట్లుగానే తమన్నా సినిమాకు 12 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓదెల 2 లాభాల జోన్‌లోకి ప్రవేశించాలంటే.. కనీసం రూ.24 కోట్ల గ్రాస్ వసూళ్లను, రూ.12 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందని నిర్దేశించారు.
ఓదెల 2కు తొలిరోజున రూ.90 లక్షల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజున రూ.85 లక్షలు, మూడో రోజున రూ.75 లక్షలు, నాలుగో రోజున రూ.90 లక్షలు, ఐదో రోజున రూ.47 లక్షలు, ఆరో రోజున రూ.7 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఆరు రోజుల వరకు ఇండియాలో రూ.3.87 కోట్ల నెట్, రూ.4 కోట్ల గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్‌లో వచ్చిన రూ.30 లక్షలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఓదెల 2 చిత్రం రూ.4.3 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.
ఇకపోతే.. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆ సెక్షన్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓదెల 2 చిత్రాన్ని భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. థియేట్రికల్ రన్ నేపథ్యంలో తమన్నా భాటియా చిత్రం నెల తిరిగేలోగా ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. సినిమాకు హిట్ కావడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఏప్రిల్ 21న సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో దర్శకుడు షాకయ్యాడు. మీ సినిమాల్లో హీరో హీరోయిన్లు, ఇతర నటీనటుల మధ్య ఫస్ట్ నైట్ సీన్‌ను ఎక్కడో ఊరి చివర పంట పొలాల్లో పెడుతూ ఉంటారు.. ఈ సినిమాలోనూ అదే రిపీటైంది. దీనికి మీ రియల్ లైఫ్‌తో ఏమైనా లింక్ ఉందా అని ప్రశ్నించారు.
దీనికి షాకైన సంపత్ నంది వెంటనే తనకు అలాంటి అనుభవమేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. మాకు మొక్కజొన్న పొలాల్లో మంచాలు ఉండేవని .. అక్కడ పైకి ఎక్కి కూర్చోని తినడం చాలా సరదాగా ఉండేదని, అలా ప్రకృతిలో గడపడం ఆహ్లాదంగా ఉండేదని సంపత్ నంది తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











