‘కొబ్బరి మట్ట’ చూశాక షకీలాపై మీ అభిప్రాయం మారిపోతుంది: సంపూర్ణేష్ బాబు

'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కెరీర్లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తూ భారీ డైలాగులు పేల్చబోతున్నాడు. ఆగస్టు 10న ఈ మూవీ విడుదల కాబోతోంది.

'కొబ్బరి మట్ట' లాంటి సినిమా, అందులోనూ మూడు డిఫరెంట్ పాత్రలు ఒకే సినిమాలో చేసే అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రలను బాగా ఎంజాయ్ చేశాను. డబ్బింగ్ సమయంలో ఆయా పాత్రలకు తగిన విధంగా స్లాంగ్ మార్చి డైలాగ్ డెలివరీ చేయడం కొత్త అనుభూతినిచ్చిందని సంపూ తెలిపారు.

Sampoornesh Babu about Shakeela role in Kobbari Matta

ఒకప్పటి శృంగారతార షకీలా ఈ చిత్రంలో సంపూ తల్లి పాత్రలో నటిస్తోంది. షకీలా గురించి సంపూ మాట్లాడుతూ... షకీలా గారంటే చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆమెను వేరే వెర్షన్లో చూపించాలనుకున్నాం. పర్సనల్‌గా కలిస్తే ఎవరైనా ఆమెపై తమ అభిప్రాయం మార్చుకుంటారు. సినిమాల్లో కనిపించేదానికి, ఆమె నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఆమె సాత్విక భావాలు కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి అంటూ ప్రశంసలు గుప్పించారు.

దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ మాట్లాడుతూ.... 'షకీలా గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, తల్లి పాత్రలో సెంటిమెంట్ సీన్లు అద్భుతంగా చేశారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని ఒక కొత్త షకీలాను మీరు ఇందులో చూస్తారు.' అని చెప్పుకొచ్చారు.

'కొబ్బరి మట్ట' చిత్రాన్ని తక్కువ బడ్జెట్లో అనుకున్నాం. కానీ షూట్‌కు వెళ్లిన తర్వాత ఖర్చు పెరిగింది. సంపూ మూడు గెటప్స్ చేయడం వల్ల షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి చేయలేక పోయాం. అటు బడ్జెట్ పెరగడం, ఇటు సినిమా షూటింగ్ సమస్యలతో ఆలస్యం అవుతూ వచ్చిందని రూపక్ తెలిపారు.

ఈ చిత్రంలో సంపూ.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ ఇలా మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X