అసెంబ్లీ బయట నగ్నంగా రచ్చ రేపిన సంపూ.. క్యాలీఫ్లవర్ సాక్షిగా, శీలో రక్షతి రక్షితః అంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సంపూర్నేష్ బాబుది సెపరేట్ క్రేజ్. అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మాహత్మ సినిమాతో ఎవరూ గుర్తించని పాత్రలో నటించిన ఆయన 'హృదయ కాలేయం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అయితే ఆయన తాజా సినిమా నుంచి వచ్చిన పోస్టర్ గత్తర లేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్

సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్

హృదయ కాలేయం అనే ఒక సెటైరిక్ సినిమాతో సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ లో బర్నింగ్ స్టార్‌ గా ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు.. సింగం 123, కొబ్బరిమట్ట వంటి సినిమాలతో మళ్ళీ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక అలా హీరోగా సినిమాలు చేస్తూనే ఏ సినిమాలో అవకాశం వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వస్తున్నాడు.

క్రేజీ ప్రాజెక్టులు

క్రేజీ ప్రాజెక్టులు

ఇక సంపూర్ణేష్ కి ఉన్న క్రేజ్ తో బోలెడు క్రేజీ ప్రాజెక్టులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ అనే సినిమా చేస్తున్నాడు, ఈ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ కూడా రిలీజ్ కూడా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు సంపూర్ణేష్ బాబు. .'క్యాలీ ఫ్లవర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

దొరగా, రాముడిగా

దొరగా, రాముడిగా

ఈ మధ్యనే సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఒక లుక్ విడుదల చేయగా అందులో ఒక దొర గెటప్‌లో కనిపించి హైప్ క్రియేట్ చేశారు. అలాగే అదే సినిమాలో శ్రీరాముడి గెటప్‌లో విల్లు ఎక్కుపెడుతున్న ఒక స్పెషల్ పోస్టర్‌ ను కూడా విడుదల చేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సినిమా టైటిల్ క్యాలీ ఫ్లవర్ కాగా శీలో రక్షతి రక్షిత: అనేది ట్యాగ్ లైన్.

ఇప్పుడు నగ్నంగా

ఇప్పుడు నగ్నంగా

ఇక ఈ రోజు ఏకంగా అసెంబ్లీ ఎదుట నగ్నంగా నిలుచొని క్యాలీఫ్లవర్ అక్కడ అడ్డుపెట్టుకుని నిలుచున్న పోస్టర్ ను విడుదల చేసారు. శాసనసభ ఎదుట క్యాలీఫ్లవర్ సాక్షిగా అనే కాప్షన్ పెట్టారు. ఇక ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు విదేశాల నుంచి మన దేశానికి వచ్చి స్త్రీల గౌరవాన్ని పవిత్రతను చెప్పే ఇంగ్లీష్ దొర పాత్రలో సంపూ కనిపించనున్నారని అంటున్నారు.

సినిమా విషయానికి వస్తే

సినిమా విషయానికి వస్తే

ఈ సినిమాలో సంపూకు జోడిగా వసంతి నటించింది. ఆర్.కే.మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఆశాజ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీప్ ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు మరో హిట్ కొడతాడు ఏమో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X