వరద బాధితులకు సంపూ సాయం.. మరోసారి గొప్ప మనసు చాటుకుంటూ
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కర్నాటక, కేరళ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులై సాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురుచుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుండగా, మరోవైపు కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతుగా సహాయం ప్రకటిస్తున్నారు.
ఈ మేరకు తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కర్ణాటక వరద బాధితుల సహాయార్థం స్పందించాడు. చిన్న హీరో అయినప్పటికీ సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే సంపూ.. తన వంతుగా 2 లక్షల విరాళం అందిస్తునట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ''ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచి వేశాయి. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిదికి ప్రకటిస్తున్నాను'' అని పేర్కొంటూ ట్వీట్ పెట్టాడు సంపూర్ణేష్ బాబు.

గతంలో కూడా హుద్ హుద్ తుఫాను బాధితులకు లక్ష సాయం, తితలీ తుపాను కారంగా కష్టాల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు రూ.50 వేలు ఆర్థిక సాయం, చెన్నై వరద బాధితులకు 50 వేల రూపాయల సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు సంపూ. దీంతో చిన్న హీరో అయినప్పటికీ సంపూ మనసు ఎందరికో ఆదర్శనీయం అంటున్నారు ప్రేక్షకులు. ఇక సంపూ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కొబ్బరిమట్ట' మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











