For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానవత్వాన్ని చాటుకొన్న సంపూర్ణేష్ బాబు.. హరీష్ రావును కలిసి..

    |

    టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే స్పందిస్తూ మానవత్వాన్ని చాటుకొంటారు. పలు సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించి ప్రశంసలు అందుకొన్నారు. తాజాగా వరద ముంపుకు గురైన తెలంగాణలో ప్రజలు కష్టాల్లో ఉన్నారనే విషయంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్న సమయంలో సంపూర్ణేష్ బాబు తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందించారు.

    తెలంగాణలోని పలు ప్రాంతాల్లోను, హైదరాబాద్‌‌లోను వరద పరిస్థితి దారుణంగా ఉంది. వారం రోజులుగా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సహాయం అందించాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపును అందుకొన్న తెలుగు సినీ పరిశ్రమ తమ వంతుగా సహాయం అందించడానికి ముందుకొచ్చింది. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి సూపర్‌స్టార్లు కోట్లలో ఆర్థిక సహాయాన్ని అందించారు.

     sampoornesh babu donation to CMRF of Telangana

    తన తోటి నటులు సహాయం అందిస్తున్న సమయంలో సంపూర్ణేష్ బాబు తనకు తోచిన విధంగా రూ.50 వేల విరాళం ప్రకటించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హారీష్ రావును కలిసి చెక్కును అందించారు. తనకు తోచిన విధంగా చిరు సహాయం అందిస్తున్నానని, దానిని స్వీకరించాలని ఆర్థించారు. తనదైన శైలిలో సహాయం అందించడానికి వచ్చిన సంపూర్ణేష్ బాబును హరీష్ రావు అభినందించారు.

    English summary
    Actor sampoornesh babu show humanity amid Hyderabad flood crisis. He donates Rs.50000 to CMRF of Telangana. He met finance minister Harish Rao and handovered the cheque.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X