ఎన్టీఆర్‌ని ఆదర్శంగా తీసుకొనే కసిగా ఆ పని పూర్తి చేశా.. సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు కెరీర్‌లో మూడో సినిమాగా వస్తోంది కొబ్బరి మట్ట మూవీ. కథ - స్క్రీన్ ప్లే - మాటలను స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు సంపూర్ణేష్ బాబు.

దీంతో ఒక్కసారిగా సంపూర్ణేష్ బాబు మరోసారి వెలుగులోకి వచ్చాడు. ఎక్కడ చూసిన ఈ డైలాగ్ కి సంబందించిన డిస్కషన్సే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు సంపూర్ణేష్ బాబు. తాను ఈ భారీ డైలాగ్ చెప్పడానికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు సంపూ.

Sampoornesh Babu Inspiring with Ntr

''కొబ్బరి మట్ట సినిమాలో 3 నిమిషాల పాటు ఆపకుండా చెప్పాలని దర్శకుడు ఓ రోజు నాతో చెప్పాడు. ఆ రోజు నాకు 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ యమధర్మరాజుగా చెప్పిన డైలాగ్స్ ను చూపించి.. ఎన్టీఆర్ ఆ డైలాగ్స్ ను ఎంత ఎనర్జీతో చెప్పారో అలా చెప్పాలని అన్నాడు. ఎన్టీఆర్ మాదిరిగా ఎంత ఎనర్జీతో ఆ డైలాగ్స్ ను చెప్పడం మొదలు పెడతావో, అంతే ఎనర్జీతో పూర్తిచేయాలని ఆయన సూచించాడు. ఆ రకంగా ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆ 3 నిమిషాల డైలాగ్ ఆగకుండా చెప్పేశా. అయితే ఆ చెప్పేందుకు ప్రాక్టీస్ కూడా బాగానే చేశానని'' సంపూర్ణేష్ బాబు అన్నాడు. ఇటీవలే విడుదలైన కొబ్బరి మట్ట ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X