twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొబ్బరిమట్ట ట్రైలర్: సంపూ విశ్వరూపం.. డబుల్ మీనింగ్ డైలాగులు వింటే నోరెళ్లబెట్టాల్సిందే

    |

    టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఈ చిత్రంతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కుస్తీ పడుతూనే ఉన్నారు. అపుడెపుడో ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో హడావిడి చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. విడుదల మాత్రం చేయలేదు. పలుమార్లు సినిమా విడుదల తేదీలను ప్రకటించినా.. అది ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాను ఈ నెల 10న విడుదల చేస్తామని ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది యూనిట్. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ రికార్డ్ నెలకొల్పిన డైలాగ్‌ను ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో చూపించారు. ఇది 3.27 నిమిషాల నిడివితో ఉంది. ఈ డైలాగుకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

    Sampoornesh Babu kobbari matta trailer released

    ఈ ట్రైలర్‌లో సంపూర్ణశ్ బాబు నట విశ్వరూపం చూపించాడు. మూడు పాత్రల పరిచయంతో మొదలైన ట్రైలర్.. సంపూ బీభత్సంతో ముగుస్తుంది. అలాగే, ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులకు కొదవ లేదు. వీటితో పాటు సంపూర్ణేశ్ డ్యాన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. షకీల తన భర్త కత్తి మహేశ్ గురించి చెప్పే డైలాగ్ కూడా సెటైరికల్‌గా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ నోరెళ్లబెట్టేయడం గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

    English summary
    Burning star Sampoornesh Babu.. One Of The Hero In Telugu Film Industry. He Is Very Famous with His First Film Hrudaya Kaleyam. This Movie Create Sensation In Tollywood. Now He acted Movie kobbari matta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X