For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైకేల్ జాక్సన్‌లా మారిపోయిన సంపూర్ణేశ్ బాబు.. స్టెప్పులు చూస్తే ఆశ్చర్యపోతారు.!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి సినిమాతోనే హాట్ టాపిక్ అయిన వారిలో సంపూర్ణేష్ బాబు ఒకరు. ఆయన 'హృదయ కాలేయం' అనే సినిమా టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. ఆకట్టుకునే అందం, సరైన ఫిజిక్ లేకపోయినా సంపూకి తెలుగు రాష్ట్రాల్లో బానే క్రేజ్ ఉంది. ఈ కారణంగానే అతడిని 'బిగ్ బాస్' రియాలిటీ షోలోకి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా సంపూ 'బందిపోటు', 'పెసరట్టు' అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఇవేమీ ఆయనకు బ్రేక్ ఇవ్వలేదు.

    సంపూర్ణేష్‌లో మరో యాంగిల్ కూడా ఉంది. ఆ మధ్య ఉత్తరాంధ్రను తితలీ తుఫాను కుదిపేసిన సమయంలో ఈ నటుడు తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. వారిని ఆదుకునేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రూ.50 వేలు ప్రకటించారు సంపూర్ణేశ్ బాబు. అంతేకాదు, 'ఒక చిన్న నటుడిపై మీ ప్రేమని మర్చిపోలేను అమ్మ.. మీ అందరూ చల్లగా ఉండాలి' అంటూ హీరో సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ప్రార్థించారు. దీంతో అప్పటి నుంచి సంపూర్ణేష్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

    Sampoornesh Babu New Getup

    ఇక, అతడి తాజా చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఈ చిత్రంతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కుస్తీ పడుతూనే ఉన్నారు. అపుడెపుడో ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో హడావిడి చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. విడుదల మాత్రం చేయలేదు. పలుమార్లు సినిమా విడుదల తేదీలను ప్రకటించినా.. అది ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాను ఈ నెల 10న విడుదల చేస్తామని ప్రకటించింది.

    తాజాగా 'కొబ్బరి మట్ట'లోని అండ్రాయుడు అనే సాంగ్ ప్రోమోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇందులో సంపూ.. మైకేల్ జాక్సన్‌లా కనిపిస్తాడు. అంతేకాదు, సరికొత్త స్టెప్పులతో అదరగొడుతున్నాడు. 'హృదయ కాలేయం'లో వేసిన స్టెప్పును కూడా ఇందులో వేసి చూపించాడు. ఇంకెందుకు ఆలస్యం ఈ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

    English summary
    Burning star Sampoornesh Babu.. One Of The Hero In Telugu Film Industry. He Is Very Famous with His First Film Hrudaya Kaleyam. This Movie Create Sensation In Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X