బర్నింగ్ స్టార్ బర్త్ డే.. సంపూర్ణేశ్ బాబు కొత్త పోస్టర్ వైరల్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్‌కు మరో స్టార్ పరిచయమయ్యాడు. స్టార్ అంటే అలాంటి ఇలాంటి స్టార్ కాదు.. ఆయన తెరపై కనిపిస్తే చాలు విజిల్స్‌తో టాప్ లేచిపోవాల్సిందే. సోలో హీరోగా వెండితెరపై నవ్వులు పూయిస్తున్న సంపూ.. అతిథి పాత్రలు, ప్రత్యేక పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. హాస్య ప్రధాన పేరడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంపూ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటించిన కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది.

బర్నింగ్ స్టార్ ఈ సారి కరోనా వైరస్ మీద దాడి చేయబోతోన్నట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనాను బర్నింగ్ స్టార్ బెదరగొట్టేట్టు కనిపిస్తున్నాడు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈ మేరకు సంపూ ట్వీట్ చేస్తూ.. 'అందరి హీరోల అభిమానుల తరపున నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు' అని పేర్కొన్నాడు.

sampoornesh Babu New Movie Poster On Coronavirus. Today (may 9) Burning Star sampoornesh Babu Birthday, On This Occassion His New Movie Title And First ook Released.

ఇక ఈ కొత్త సినిమా పోస్టర్‌ను గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. వుహాన్‌లో గబ్బిలాల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ పోస్టర్‌లో 'ఉహాన్' గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా అని వేశాడు. అంతేకాకుండా మాస్క్‌లు ధరించండి, భౌతిక దూరం పాటించండని కూడా పోస్టర్‌లో కనిపిస్తోంది. జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. సినిమా టైటిల్, సంపూ ఫస్ట్ లుక్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

sampoornesh Babu New Movie Poster On Coronavirus. Today (may 9) Burning Star sampoornesh Babu Birthday, On This Occassion His New Movie Title And First ook Released.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X