ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఉదంతంపై సంపూర్ణేష్ బాబు స్పందన.. హరీష్ రావు ఫోన్ చేసి ఏమన్నాడంటే!
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. సిద్దిపేట పట్టణంలో జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు జరిగిన ఈ ఘటనపై స్పందిస్తూ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశాడు సంపూర్ణేష్ బాబు. వివరాల్లోకి పోతే..

ఏమీ కాలేదు కానీ.. సంపూర్ణేష్ బాబు
ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ కారు ప్రమాదం నుంచి తాము, తమ పిల్లలు బయటపడ్డామని అన్నారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమీ గాయాలు కాలేదని చెప్పాడు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమానురాగాలకు ధన్యవాదాలు అని తెలిపాడు.

మా పిల్లలు భయపడ్డాను.. అందుకే
కాకపోతే ఈ ప్రమాదం కారణంగా తమ పిల్లలు బాగా భయపడ్డారని చెప్పాడు సంపూర్ణేష్ బాబు. అందుకే నిన్న టాలీవుడ్ నుంచి ఎంతో మంది సెలెబ్రిటీలు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేక పోయానని అన్నాడు. నిన్నంతా తన పిల్లలతోనే గడిపానని, కనీసం ఎవ్వరి మెసేజ్‌కి కూడా రిప్లై ఇవ్వలేక పోయానని అన్నాడు.

హరీష్ రావు ఫోన్ చేసి ఏమన్నాడంటే!
తన కారు ప్రమాదం గురించి తెలిసి మంత్రి హరీష్ రావు ఫోన్ చేశాడని సంపూర్ణేష్ బాబు తెలిపాడు. మంత్రి గారు తన యోగక్షేమాలు అడిగారని చెప్పాడు. హృదయకాలేయం అనే చిన్న సినిమాతో మీ ముందుకు వచ్చిన ఈ చిన్న నటుడిని ఇంతలా ఆదరించి ప్రేమిస్తున్న మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని సంపూర్ణేష్ బాబు అన్నాడు.
సంపూ.. భారీ డైలాగ్
ఇటీవలే 'కొబ్బరిమట్ట' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకున్నాడు సంపూ. ఈ సినిమాలో ఆయన చెప్పిన భారీ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. సింగల్ టేక్‌లో
సంపూ చెప్పిన ఈ డైలాగ్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు సంపూర్ణేష్ బాబు.
Recommended Video

చిన్న నటుడు.. పెద్ద హృదయం
నిజానికి టాలీవుడ్‌లో సంపూర్ణేష్ బాబు చాలా చిన్న నటుడు. కానీ ఆయన హృదయం, సామాజిక కోణంలో ఆలోచించే తీరు చెప్పుకోదగినది. కర్నాటక, కేరళ రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సమయంలో ఆయన ఆర్ధికంగా సాయం అందించి అందరు నటీనటుల్లో తానూ భిన్నం అని నిరూపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











