పవన్ -సంపూ ఇద్దరూ ఒకటేనన్న ఏపీ మంత్రి.. అదిరిపోయే కౌంటర్ వేసిన సంపూ!

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో వైసీపీ ప్రభుత్వం పై పవన్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం నుంచి కూడా గట్టిగానే కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా మంత్రి వెల్లంపల్లి, అనిల్ కుమార్ లు స్పందించగా దానికి సంపూర్ణేష్ బాబు కౌంటర్ వేశారు. ఆ వివరాల్లోకి వెళితే

సంపూ పవన్ ఒకటే

సంపూ పవన్ ఒకటే

నెల్లూరులో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని అన్నారు. ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో చర్చించారని, ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం ? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి ? అని ఆయన ప్రశ్నించారు. అకౌంటబిలిటీ రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని పేర్కొన్న అనిల్ పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్.. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశం అని అన్నారు.

కరెక్ట్ కాదు

కరెక్ట్ కాదు

అలాగే సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురు మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది, ఇది ఎంతవరకు సబబు? అని ప్రశ్నించిన అనిల్, నా ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరికాదని అన్నారు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని పేర్కొన్న మంత్రి అనిల్ చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదన్నారు.

జగన్ ను ఇబ్బంది పెట్టాలనే

జగన్ ను ఇబ్బంది పెట్టాలనే

పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మాట్లాడినట్లు స్పష్టమవుతోంది అని మంత్రి అనిల్ అన్నారు. చిత్ర పరిశ్రమనంతా ఇబ్బంది పెడుతున్నామని ప్రొజెక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్న మంత్రి అనిల్ రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్‌ను తిట్టడం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు.

చాప చుట్టేయడం ఖాయం

చాప చుట్టేయడం ఖాయం

''ప్రభుత్వ తీరును మారుస్తాను.. నేను రోడ్డు మీదకు వస్తే మనిషిని కాదు.. బెండు తీస్తాం..'' అని మాట్లాడటం పవన్ కళ్యాణ్‌కు కొత్తేం కాదని, ఆయన విజ్ఞతతో మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు అనిల్. రెండు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకే మా అడుగులు అంటున్నాడని, పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పైకెళ్ళి లోపలే పార్టీ చాప చుట్టేయడం ఖాయం అని మంత్రి అన్నారు. అయితే దీనికి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ జనసేన నుంచి అయితే ఎలాంటి స్పందనా రాలేదు.

Recommended Video

Mahesh Babu Is The Brand Ambassador For Big C
మంత్రికి సంపూ కౌంటర్

మంత్రికి సంపూ కౌంటర్

తాజాగా ఈ విషయం మీద సంపూర్ణేష్ బాబు స్పందించారు. '' మంత్రి అనిల్ గారు, మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం, ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు.''

అంటూ ఆయన మంత్రికి కౌంటర్ వేశారు. మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ అంటూ సంపూర్ణేష్ బాబు ఏపీ మంత్రికి కౌంటర్ వేయడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అని చెప్పచ్చు. ఈ వివాదం ఎంత దూరం వెళ్లనుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X