twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శీలం గురించి మెసేజ్ ఇవ్వబోతున్న సంపూ: ‘క్యాలీఫ్లవర్’ అంటూ అలా వచ్చేశాడు

    |

    చిత్ర విచిత్రమైన సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. పేరడీ సినిమాల స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. మొదటి సినిమా 'హృదయ కాలేయం'తో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలను పోషించి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే 'కొబ్బరి మట్ట' అనే సినిమా చేశాడు. ఇది ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో అతడి మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీని తర్వాత మరో విభిన్న చిత్రంతో వస్తున్నాడు.

    'కొబ్బరి మట్ట' వంటి భారీ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 'క్లాలీఫ్లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆర్కే మలినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పరిచయ వీడియో తాజాగా విడుదలైంది. ఇందులో హీరో సంపూ పాత్రను ఎలివేట్ చేసి చూపించారు. 'గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే.. సర్ అర్ధర్ కాటన్ బ్యారేజీ నిర్మిస్తే.. భారతదేశ మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఇంగ్లండ్ నుంచి దిగాడు ఈ క్యాలీఫ్లవర్' అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో ఈ వీడియో నడిచింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

    Sampoornesh Babus Cauliflower Movie First Look Released

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'క్యాలీఫ్లవర్' మూవీకి గోపి కిరణ్ ఈ కథను అందించారు. మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్‌ల భాగస్వామ్యంలో ఆశా జ్యోతి గోగినేని దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సంపూ సరసన వసంత హీరోయిన్‌గా చేస్తోంది. పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, గెటప్ శ్రీను, రోహిణి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రజ్వాల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూట్ ఇటీవల మొదలైంది.

    English summary
    Sampoornesh Babu is an Indian film actor known for his works in the spoof comedy genre in Telugu cinema. He made his acting debut as the lead role in the 2014 film, Hrudaya Kaleyam, for which he won the CineMAA Award for Best Actor in a Comic Role. He is known for his comedic films and was also a contestant in Bigg Boss Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X