రిలీజ్‌కు ముందు కొబ్బరిమట్ట సెన్సేషన్.. క్రేజీగా ప్రీ రిలీజ్ బిజినెస్
దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. సాయి రాజేష్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత 'కొబ్బరిమట్ట' సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
రిలీజ్‌కు కొబ్బరిమట్ట చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం హక్కులు, ఓవర్సీ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా హక్కులను 'నో బారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' సంస్థ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది.

కొబ్బరి మట్ట చిత్రాన్ని కోటి రూపాయలకు హక్కులను సొంతం చేసుకొన్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. సంపూర్ణేష్ బాబు సినిమాకు ఇలా క్రేజీ ఆఫర్ దక్కడం చర్చనీయాంవమైంది. కుటుంబ నేపథ్యంగా, హై ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొబ్బరి మట్ట చిత్రాన్ని సాయి రాజేష్ నీలమ్ నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ స్టివెన్ శంకర్ అందించారు. ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్టిబ్యూషన్ చేస్తున్నది.
ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్రలు వేయటమే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వరల్డ్ రికార్డు ని నెలకొల్పాడు.. ఈ చిత్రం లో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్యద్బుతమైన పాత్రలు చేసి మెప్పించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం లో తెలుగు సినిమా లో వున్న నటీనటులందరూ నటించారు. ఈ సినిమా కి సంబందించి ఇటీవల విడుదల చేసిన అఆ.. ఇఈ అనే సాంగ్ యూట్యూబ్ లో రెండు మిలియన్స్ వ్యూస్ 24 గంటల్లో రావటం ఈ చిత్రం పై సినిమా లవర్స్ కి వున్న క్రేజ్ ని తెలియజేస్తుంది. ఈ భారి చిత్రాన్ని అగష్టు 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాత భారి ప్రయత్నాలు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











