తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయనది ఏమనగా: రేపే సంపూ మూవీ ఫస్ట్ లుక్

విచిత్రమైన సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. మొదటి సినిమా 'హృదయ కాలేయం' సంచలనం సృష్టించిన అతడు.. ఆ తర్వాత అదే తరహా చిత్రాలు చేసి స్ఫూఫ్ హీరోగా పేరొందాడు. అదే సమయంలో కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలను పోషించి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక, అతడి కెరీర్‌లో వచ్చిన 'కొబ్బరి మట్ట' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో అతడి మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోయిందనే చెప్పాలి.

'కొబ్బరి మట్ట' వంటి భారీ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కేఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి 'బజారు రౌడీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక, ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రేపు అంటే ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.

Sampoornesh Babus New Movie First Look and Motion Poster will Release Tomorrow!

ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. 'ఇందుమూలంగా యావత్ ఆంధ్రా తెలంగాణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా.. మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన SAMPOO5 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రేపు విడుదల కాబోతుందహో' అని అందులో పేర్కొంది. దీంతో ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ స్పాట్‌లో క్లైమాక్స్ ఫైట్ సీన్ చిత్రీకరిస్తోన్న సమయంలో హీరో సంపూర్ణేష్ బాబు బైకు పైనుంచి కింద పడిపోయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X