సూపర్ కంటెంట్‌తో జెమ్.. సంపూ ప్రత్యేక ఆకర్షణగా.. సెప్టెంబర్ 17న రిలీజ్
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో మంచి కంటెంట్ వచ్చి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగా ఉంటే.. ప్రేక్షకులు సినిమాను హిట్ చేస్తారనే విషయం SR కల్యాణ మండపం లాంటి చిత్రాలు నిరూపించాయి. అలాంటి కోవలో వస్తున్న కంటెంట్ ప్రధానమైన చిత్రం జెమ్. పేరు తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందనే విషయం సినీ వర్గాల్లో నెలకొన్నది. యువ నటీనటులు విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జెమ్. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న జెమ్ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో సినిమా టీమ్ జెమ్ చిత్ర విశేషాలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...జెమ్ మూవీని అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించేందుకు సహకరించిన నిర్మాత పత్తికొండ కుమారస్వామికు థాంక్స్. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అందరు మెచ్చేలా రూపొందించాం. సునీల్ కశ్యప్ మ్యూజిక్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. విజయ్ రాజా యాక్టింగ్ హైలైట్‌గా నిలుస్తుంది అని అన్నారు.
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సినిమాను విడుదల దాకా తీసుకురావడం గొప్ప విషయం. అందుకు నిర్మాతను అభినందించాల్సిందే. జెమ్ చిత్రంలో విజయ్‌రాజా యాక్టింగ్ ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. నా బెస్ట్ వర్క్ ఇచ్చేందుకు ప్రయత్నించాను అని అన్నారు.
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ...జెమ్ సినిమాకు బలం సాంకేతిక నిపుణులు. అజయ్, సంపూర్ణేష్ బాబు, రచ్చ రవి లాంటి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని అన్నారు.
హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ...నాకు ఈ సినిమాతో మంచి అనుభవాన్ని పొందాను. శశి, జెమ్ చిత్రాలు నా కెరీర్ లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ అన్నీ అంశాలు ఉన్న చిత్రమిది అని అన్నారు.
నటీనటులు: రాశీ సింగ్, విజయ్ రాజా, అజయ్, సంపూర్ణేష్ బాబు, రచ్చ రవి తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
పీఆర్వో: జీఎస్కే మీడియా
నిర్మాత: పత్తికొండ కుమారస్వామి
దర్శకత్వం: సుశీల సుబ్రహ్మణ్యం


Click it and Unblock the Notifications











