Sampradayini Suppini Suddapoosani Trailer Review: సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ రివ్యూ
టాలీవుడ్ నటుడు శివాజీ నిర్మాతగా మారి శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించిన చిత్రం సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఈ చిత్రంలో శివాజీ హీరోగా, సీనియర్ నటి లయ లీడ్‌గా నటిస్తున్నారు. ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సుధీర్ శ్రీరామ్ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మార్చి 6వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? అనే వివరాల్లోకి వెళితే..

శ్రీరామ్ (శివాజీ)కి భార్య (లయ), కొడుకు (రోహన్) నుంచి రకరకాల వేధింపులు, సమస్యలు వస్తాయి. వారితో గొడవ పడుతూ వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం సాగుతుంది. కొడుకు చేసే అల్లరి చిల్లరి పనులు, భార్యకు ఉండే అత్యాశ శ్రీరామ్‌కు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. ఈ క్రమంలో అనుకోకుండా ఓ వ్యక్తి మరణిస్తాడు. ఆ మృతి చెందిన వ్యక్తి బాడీని దాచేందుకు చేసే ప్రయత్నంలో అనేక గందరగోళాలు ఏర్పడుతాయి. అవేమిటనే విషయాన్ని మార్చి 6వ తేదీన చూడమని ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు.
ఇక ట్రైలర్‌లో డైలాగ్స్ భారీగానే పేలాయి. రోహన్, శివాజీ, లయ మధ్య సెటైర్లు భారీగానే వర్కవుట్ అయ్యాయని ట్రైలర్ స్పష్టం చేసింది. మాములుగానే నెత్తి పగలకొట్టే వాడిని.. నీవు కొట్లాడుదామని అంటున్నావ్.. చూస్కో మరి అంటూ రోహన్ తన క్యారెక్టర్ ఏమిటో చూపించాడు. ఇక లంచం ఎందుకు తీసుకొంటారు? దానిని గిఫ్ట్‌గా తీసుకోండి అంటూ భార్య వేధింపులు కనిపించాయి. కొడుకు, భార్య వేధింపులను తట్టుకోలేక.. ఓ దశలో పెళ్లాన్ని చంపిన భర్తగా నా పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేయకు అంటే.. అదే రేంజ్‌లో నాకు అలాంటి అవకాశం ఇవ్వకు అంటూ రివర్స్ గేర్ వేసింది.
ఇక డెడ్ బాడీని దాచే క్రమంలో జరిగే డ్రామా, సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆద్యంత కామెడీకి పెద్ద పీట వేసే విధంగా ఈ సినిమా రూపొందిందని చిత్ర యూనిట్ తమ ప్రమోషన్స్‌లో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయి. అయితే ఈ సినిమాను శివాజీ స్వయంగా నిర్మిస్తుండటంతో బాగుంటుందనే అంచనాలు క్రియేట్ చేశాయి. నిర్మాతగా శివాజీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు? బన్నీ వాసు, వంశీ నందిపాటి డిస్టిబ్యూటర్లుగా మళ్లీ గ్రాండ్ సక్సెస్ కొడుతారా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











