రాజమౌళితో 11 ఏళ్ల స్నేహం.. అందుకే RRRలో అవకాశం.. క్లారిటి ఇచ్చిన సీనియర్ దర్శకుడు

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమా RRR. ఈ సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు రాజమౌళితో స్నేహం గురించి చెప్పాడు.

వీరి స్నేహం.. ఇప్పటిది కాదు

వీరి స్నేహం.. ఇప్పటిది కాదు

RRR సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు కొంతమంది టాలెంటెడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అజయ్ దేవ్ గన్, శ్రియా అలాగే తమిళ దర్శకుడు, నటుడు సముథ్రఖని కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. జక్కన్నతో ఈ దర్శకుడికి RRR సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం కాదు. ఎప్పటి నుంచో వీరు మంచి స్నేహితులట.

తెలుగులో బిజీగా మారిన తమిళ నటుడు

తెలుగులో బిజీగా మారిన తమిళ నటుడు

సముథ్రఖని మొదట దర్శకుడిని అందరికి తెలిసిన విషయమే. ఇక ఎప్పుడైతే అల.. వైకుంఠపురములో సినిమా ద్వారా ఆయన నటుడిగా మంచి క్రేజ్ అందుకున్నారో అప్పటి నుంచే టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఇక ఇటీవల క్రాక్ లో కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం తగ్గకుండా తనకు సెట్టయ్యే పాత్రల్లో నటిస్తున్నారు.

RRRలో పవర్ఫుల్ రోల్

RRRలో పవర్ఫుల్ రోల్

ఇక RRR సినిమాలో కూడా సముథ్రఖని చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి మొదటిసారి ఒక డిఫరెంట్ యాక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఆ పాత్ర చాలా బలంగానే ఉంటుందని ఊహించవచ్చు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సముథ్రకని కూడా అదే అన్నారు. క్రాక్ సినిమా సక్సెస్ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చిత్ర యూనిట్ తో ఇటీవల ఆయన కూడా జాయిన్ అయ్యారు. రాజమౌళితో ఏర్పడిన స్నేహం గురించి కూడా చెప్పారు.

ఆ సినిమా ద్వారా క్లోజ్ అయిన రాజమౌళి

ఆ సినిమా ద్వారా క్లోజ్ అయిన రాజమౌళి

రాజమౌళితో పరిచయం ఇప్పటిది కాదట. నాడోడిగల్ సినిమా చూశాక సముథ్రఖని దర్శకత్వ ప్రతిభకు జక్కన్న పెద్ద ఫ్యాన్ అయిపోయాడట. తెలుగులో ఆ సినిమాను శంభో శివ శంభోగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా చూసిన తరువాత రాజమౌళి తనకు చాలా క్లోజ్ అయ్యాడని చెప్పిన సముథ్రఖని ఎన్నోసార్లు సినిమాల గురించి చర్చించుకుంటామని అన్నాడు. అలాగే 11 ఏళ్ల నుంచి పెరిగిన పరిచయంలో ఆయన నాలో మంచి నటుడిని గుర్తించి RRR లో ఛాన్స్ ఇచ్చినట్లు కూడా సముథ్రఖని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X