‘సర్కారు వారి పాట’లో వాళ్లిద్దరి సీన్స్ హైలైట్: సినిమా మొత్తంలో ఆ ఎపిసోడ్‌‌కు పూనకాలేనట

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనలోని టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ హ్యాండ్సమ్ హీరో.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో హ్యాట్రిక్‌ను అందుకున్నాడు. ఈ జోష్‌లోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు మరిన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. బ్యాంకుల చుట్టూ జరిగే అవినీతిని హైలైట్ చేస్తూ సందేశాత్మక కథకు కమర్షియల్ హంగులను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా సందేశాత్మక చిత్రాల్లోనే నటిస్తోన్న మహేశ్ బాబు.. ఈ చిత్రంతో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో అతడు వింటేజ్‌ లుక్‌తో కనిపించాడు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Samuthirakani and Mahesh Babu Fight Highlight in Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'ను చేస్తున్నట్లు గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించాడు. అప్పుడు కరోనా ప్రభావంతో ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో రెండో దానిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇటీవలే మూడో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లింది. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభం అయింది. దీన్ని శరవేగంగా జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ షెడ్యూల్‌లో బ్యాంక్ సెట్‌లో షూట్ చేస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబును ఢీకొట్టే విలన్ పాత్రను ప్రముఖ డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మహేశ్ బాబుతో ఆయన తలపడే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయట. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే విధంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి వీళ్లిద్దరూ మైండ్‌గేమ్ ఆడుతూ చేసే సవాళ్లు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయన్న టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అల్ట్రా స్టైలిష్ ‌లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసేసింది. ఇక, ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X