మహేశ్ బాబుతో ఫైట్‌కు రెడీ అయిన డైరెక్టర్: ప్లాన్ ప్రకారమే మొదలు పెట్టేశాడట

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో హ్యాట్రిక్‌ను అందుకున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. అంతే ఉత్సాహంతో ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేద్దామని భావించాడు. కానీ, అది పలు కారణాల వల్ల అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే మరో దర్శకుడికి అవకాశం ఇచ్చిన మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

'సోలో', 'గీత గోవిందం' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు పరశురాం డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'సర్కారు వారి పాట'. బ్యాంకుల చుట్టూ జరిగే అవినీతిని హైలైట్ చేస్తూ సందేశాత్మక కథకు కమర్షియల్ హంగులను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా సందేశాత్మక చిత్రాల్లోనే నటిస్తోన్న మహేశ్ బాబు.. ఈ చిత్రంతో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో అతడు వింటేజ్‌ లుక్‌తో కనిపించాడు.

Samuthirakani Join Mahesh Babus Sarkaru Vaari Paata Hyderabad Schedule

మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'ను చేస్తున్నట్లు గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించాడు. అప్పుడు కరోనా ప్రభావంతో ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో రెండో దానిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇటీవలే మూడో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లింది. ఇది కూడా వారం రోజుల క్రితమే ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభం అయింది.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు మహేశ్ బాబు. ఇందులో భాగంగానే షెడ్యూల్ షెడ్యూల్‌కు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ముందుకెళ్తున్నాడు. అలా ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోన్న చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఇక, ఈ చిత్ర షూటింగ్‌లో విలన్ పాత్రను చేస్తోన్న సముద్రఖని తాజాగా చేరారని ఓ న్యూస్ లీకైంది. ప్రస్తుతం ఆయనపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు, ఈ షెడ్యూల్‌లోనే మహేశ్ బాబుతో ఫైట్‌కు రెడీ అయ్యే ఓ ఎపిసోడ్‌ను కూడా షూట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Samuthirakani Join Mahesh Babus Sarkaru Vaari Paata Hyderabad Schedule

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అల్ట్రా స్టైలిష్ ‌లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక, ఇందులో అతడు రఫ్ రోల్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X