Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో నాని సినిమా.. మళ్ళీ ఏడేళ్ల తరువాత..
నేచురల్ స్టార్ నాని గత కొంతకాలంగా అభిమానుల అంచనాలను ఎక్కువగా అందుకోలేకపోతున్నాడు. చివరగా 2017లో వచ్చిన నిన్నుకోరి సినిమా తరువాత ఇంతవరకు సరైన సక్సెస్ చూడలేదు. ఎలాంటి సినిమా చూసినా కూడా గతంలో మాదిరిగా డబుల్ ప్రాఫిట్స్ అయితే అందడం లేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ కేవలం పెట్టిన పెట్టుబడులను వెనక్కి తెచ్చాయి అంతే.
అయితే నాని ఏడేళ్ల అనంతరం ఒక సీనియర్ దర్శకుడితో మళ్ళీ కలవనున్నట్లు సమాచారం. 2015లో నాని జెండా పై కపిరాజు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. మొదటిసారి ఆ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. అప్పట్లో నాని కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. జెండా పై కపిరాజు సినిమాను డైరెక్ట్ చేసింది నటుడు సముథ్రకని. ఇక సినిమా ప్లాప్ అయినా కూడా హీరో డైరెక్టర్ మధ్య రిలేషన్ పాడవ్వలేదు.
ఇక వారి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు సముథ్రకని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పకుండా నానితో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతానని చెప్పాడు. ఒక స్క్రిప్ట్ కూడా సిద్ధం అవుతోందని ఆ కథ నానికి కరెక్ట్ గా సెట్టవుతుందని కూడా చెప్పాడు. నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని దర్శకుడు వివరణ ఇచ్చాడు.