Bheemla Nayak: సీక్రెట్ లీక్ చేసిన ప్రముఖ హీరోయిన్.. ఏకంగా పవన్‌ ఫొటో షేర్ చేసి మరీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రీమేక్‌ మూవీలు, మల్టీస్టారర్‌లు భారీ స్థాయిలో వస్తున్నాయి. వేరే భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను మన వాళ్లు రీమేక్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఇప్పటికే తెలుగులోకి అనువాదం అయిన సినిమాలు చాలా వరకూ సక్సెస్ అయ్యాయి. దీంతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలా పలు ప్రాజెక్టులు పట్టాలపై ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రూపొందుతోన్న ఓ భారీ రీమేక్ అండ్ మల్టీస్టారర్ మూవీయే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా వస్తోంది.

'భీమ్లా నాయక్' మూవీలో తెలుగు స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. అయితే, దగ్గుబాటి రానాకు జోడీగా ఎవరు నటిస్తున్నారన్న దానిపై క్లారిటీ రాలేదు. కానీ, ఈ పాత్రకు ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నారని ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే, ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకుందని ఇటీవలే మరో న్యూస్ వైరల్ అయింది. దీంతో ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న ఆసక్తి రేకెత్తింది.

Samyuktha Menon Clarity on Bheemla Nayak Offer

'భీమ్లా నాయక్' మూవీలో దగ్గుబాటి రానా సరసన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తుందని కూడా రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సంయుక్త సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'నాయకుడు, పవర్ స్టార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. భీమ్లా నాయక్‌లో రానాకు జోడీగా చేస్తున్నా. టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిగా చూస్తున్నాను. ఈ సంక్రాంతి అదిరిపోయేలా ఉండబోతుంది' అంటూ ప్రకటనకు ముందే లీక్ చేసేసింది.

'భీమ్లా నాయక్' మూవీని విలక్షణ చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మరో స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్ వీడియోతో పాటు ఓ పాట కూడా విడుదలైంది. వీటికి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఇక, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్‌గా, రానా లోకల్ డాన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X