Samyuktha Menon: మలయాళ భామతో రానా రొమాన్స్.. ఆమెను కాదని ఇలా ఫిక్స్ చేసుకుని!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో మల్టీస్టారర్ మూవీలు ఒకటి. గతంతో పోలిస్తే ఇప్పటి ఫ్యాన్స్‌ అభిరుచిలో మార్పులు రావడంతో పాటు హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీంతో ఆ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు తెలుగులో సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ఓ భారీ మల్టీస్టారర్ మూవీయే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది.

తెలుగు స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రమే 'భీమ్లా నాయక్'. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర రూపొందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు కూడా చేరుకుంది.

 Samyuktha Menon On Board for Bheemla Nayak

భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. అయితే, దగ్గుబాటి రానా సరసన ఎవరు నటిస్తున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ, ఈ పాత్రకు కోలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే, ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకుందని ఇటీవలే మరో న్యూస్ వైరల్ అయింది. దీంతో ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న చర్చలు జరిగాయి.

'భీమ్లా నాయక్' సినిమాలో దగ్గుబాటి రానా సరసన మలయాళ భామ సంయుక్త మీనన్ నటిస్తుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రాకముందే ఆమె తన ట్విట్టర్‌లో 'నాయకుడు, పవర్ స్టార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. భీమ్లా నాయక్‌లో రానాకు జోడీగా చేస్తున్నా. టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిగా చూస్తున్నాను. ఈ సంక్రాంతి అదిరిపోయేలా ఉండబోతుంది' అంటూ పోస్ట్ చేసింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ యూనిట్ ఆమెకు స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఇందులో నటించేది సంయుక్తనే అని తేలిపోయింది.

 Samyuktha Menon On Board for Bheemla Nayak

'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్ వీడియోతో పాటు ఓ పాట కూడా విడుదలైంది. వీటికి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఇక, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్‌గా, రానా లోకల్ డాన్‌గా నటిస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X